E-Paper
Advertisement

Election Betting : తెలంగాణ ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్..

Election Betting : తెలంగాణ ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్..
Advertisement
Telangana election news

Telangana election news(TS today news) :

తెలంగాణలో ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి ఫోకస్ తెలంగాణపైనే ఉన్నాయి. అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై దేశ నలుమూలల బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. గతవారం రోజుల్లో ఈ ఎన్నికలపై ఉత్కంఠ మూడింతలు పెరిగింది. రాజకీయ నేతలనే కాదు.. సామాన్యుడిని కదిపినా.. తెలంగాణ ఎన్నికల గురించే ప్రస్థావిస్తున్నారు. దీంతో.. బెట్టింగ్ యాప్ లు, బుకీలు ఈ ఉత్కంఠను క్యాచ్ చేసుకునే పనిలో పడ్డాయి.

ఇప్పటి వరకు 3 వేల కోట్లకు పైగా బెట్టింగులు జరిగినట్టు తెలుస్తోంది. పోలింగ్ తర్వాత ఈ బెట్టింగుల వేగం మరింత పుంజుకుంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత.. కౌంటింగ్‌కి ముందు ఈ బెట్టింగులు 10 వేల కోట్ల వరకూ చేరే ఛాన్స్ ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా బెట్టింగులు నిర్వహిస్తే.. పోలీసుల నిఘా ఉంటుందని.. దేశంలో నలుమూల నుంచి బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా కేంద్రంగా జరుగుతున్నాయి. ఇక ఏపీలో కూడా విచ్చల విడిగా బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే, తెలంగాణ ఫలితాలపై.. తెలంగాణ ప్రజల కంటే.. ఏపీ ప్రజలే ఎక్కువగా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. పందాలకు మారు పేరుగా ఉన్న గోదావరి జిల్లాల్లో జోరుగా బెట్టింగులు వేస్తున్నారని తెలుస్తోంది. వాళ్ల వాళ్ల స్థాయిని బట్టి కోట్లు, లక్షలు, వేలు, వందల్లో పందాలు వేస్తున్నారు. కొందరు అయితే.. భూములు, చేపల చెరువులు కూడా బెట్టింగులో పెడుతున్నారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, ఆ పందాలను ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదని తలలు పట్టుకుంటున్నారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×