BigTV English

Rythu Bandhu : రైతు బంధుకు లైన్ క్లియర్.. కండిషన్స్ అప్లై

Rythu Bandhu : రైతు బంధుకు లైన్ క్లియర్.. కండిషన్స్ అప్లై
Rythu Bandhu scheme update

Rythu Bandhu scheme update(Telangana news today) :

అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. అయితే రైతు బంధు పంపిణీ అనుకున్నంత సులువుగా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 28 లోగానే ఇదంతా పూర్తిచేయాలని, ఆ తరువాత అంటే 29వ తేదీ, పోలింగ్ రోజు 30న రైతు బంధు పంపిణీకి అనుమతించమని ఆదేశించింది.


దీంతో ఎన్నికలకు ముందు డబ్బును జమ చేయాలంటే ఈ నెల 28లోపు పంపిణీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే బ్యాంకులకు 25 నుంచి 27 వరకు.. అంటే వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో కేవలం ఒక్క 28వ తేదీన మాత్రమే డబ్బు పంపిణీకి అవకాశం ఉంది. అయితే రైతు బంధు నిధులను ఎప్పుడు విడుదల చేసినా ముందుగా తక్కువ భూ విస్తీర్ణం ఉన్న రైతులకే మొదట పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే విధంగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఒక్కరోజులో రైతులందరి ఖాతాల్లో డబ్బును జమ చేయడం అంత సులువు కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎకరానికి 5 వేల చొప్పున మొత్తం 65 లక్షల రైతుల ఖాతాల్లో దాదాపు 7 వేల 500 కోట్లను జమ చేయాల్సి ఉంది. ఈ సారి పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అందిస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతోంది. ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో బీఆర్ఎస్ రైతుబంధు అర్హులందరికీ 28న రాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×