E-Paper
Advertisement

EV Battery Course: యువతకు గుడ్ న్యూస్.. నూతన ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం

EV Battery Course: యువతకు గుడ్ న్యూస్.. నూతన ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం
Advertisement

EV Battery Course: స్వేఛ్చ బ్యూరో: ప్రపంచ దేశాలు వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోంటున్నాయని ఎరైడ్ ఎమొబిలిటీ ఫౌండర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హైదరాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అల్వాల దేవేందర్ రెడ్డి అన్నారు.ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించే విధంగా గ్రీన్‌హౌస్ ఏర్పాట్లను చేపట్టాలని వివరించారు. 2015 పారిస్ లో జరిగిన కాప్ 21 సమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాన్ని 195 దేశాలు స్వాగతించాయని తెలిపారు. ఇందుకోసం ప్రతిదేశం వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను తయారు చేసుకుని నెట్ జీరో పొల్యూషన్ ను సాధించే దిశలో ప్రయాణిస్తున్నాయని వివరించారు.

ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ సస్టైనబిలిటీ ఇంజనీర్ కోర్సు

భారతదేశం 2047 నాటికీ ఈ అద్భుతాన్ని సాధించాలంటే ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటుగా రెనీవబుల్ ఎనర్జీ అలవాటుపడాలని సూచించారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ సస్టైనబిలిటీ ఇంజనీర్ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా చీణాక్య సెమానీర్ హాల్​ జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవేందర్ రెడ్డి పాల్గోని ప్రసంగించారు. భూమిపైన మనుషులే కాకుండా 30 వేల జీవరాసులు నివసిసున్నాయని, వాతావరణ కాలుష్యాన్ని సృష్టిస్తున్న మనిషికి వీటిని నిర్మూలించే హక్కు లేదన్నారు. సముద్రాలను, కొండలను, అడవులను, ప్రకృతి పర్యావరణాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. పెట్రోలియం వాహనాలను తగ్గించి విద్యుత్ వాహనాలను ఎంచుకోవాలని దేవేందర్ రెడ్డి అన్నారు.

Advertisement

Also Read: Tarun Career: లవర్ బాయ్ తరుణ్ ఫేడ్ అవుట్ అవ్వడానికిక కారణం ఇదే.. విజయ్ భాస్కర్

ఆత్మ నిర్భర్ భారత్..

సమావేశానికి హాజరైన మరొక ముఖ్య అతిధి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ… వాయు కాలుష్యం కారణంగా ఐదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లల్లో రోజుకు సుమారు రెండు వేల మంది చనిపోతున్నారని తెలిపారు. పదిహేను ఏళ్లలోపు పిల్లల్లో 93 శాతం మంది హానికరమైన, ప్రమాదకరమైన గాలిని పిలుస్తున్నారని ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని మనం చూడాలంటె ఎలక్ట్రిక్ వాహనాల వాడకం తప్పనిసరి అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద నూతన సాంకేతిక విధానాలను ప్రోత్సహించడానికి అవసరమైన అన్ని సదుపాయాలున్నాయన్నారు. బ్యాటరీ ఇంజనీర్ కోర్స్ ఎప్పటికీ వన్నె తగ్గని కోర్స్ అన్నారు. భవిష్యత్తులో విద్యుత్ వాహనాల సంఖ్య పెరుగుతూనే వుంటాయని, అన్ని వాహనాలకు బ్యాటరీలు తప్పనిసరి కాబట్టి ఈ కోర్సు నేర్చుకోవడం వలన యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

కేవలం రూ.20 వేల ఫీజుతో..

Advertisement

ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు మాట్లాడుతూ 18 నుండి 45 ఏళ్ల లోపు బి.టెక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఎన్విరాన్మెంటల్ మూడేళ్లు పూర్తిచేసిన వాళ్లు, ఫైనల్ ఇయర్ లో వున్న వారు చేరవచ్చని తెలిపారు. ఆరు వందల గంటలు వుండే ఈ కోర్సు లో చేరడానికి ప్రతి బ్యాచ్ లో 40 మంది ఉంటారన్నారు. బ్యాటరీ టైప్స్, అండ్ టెక్నాలజీస్ బ్యాటరీ రీ సైక్లింగ్, బ్యాటరీ కలెక్షన్ అండ్ సార్టింగ్, బ్యాటరీ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ మొదలైనవి ఈ కోర్సులో వుంటాయని వివరించారు. కేవలం రూ.20 వేల ఫీజుతో ఈ కోర్సులో చేరవచ్చన్నారు. నూతనంగా ఈ కోర్సులో చేరిన 40 మంది విద్యార్థులతో పాటు ఆస్కీ సీనియర్ కన్సల్టెంట్ కె.సుదర్శన్, వాసవి మోటార్స్ సీఈఓ డాక్టర్ వెంకటేశం, కాలేజ్ చీఫ్ ఎస్.లక్ష్మి కాంత రావు , డాక్టర్ పి.రాజా రావు, స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అశోక్, ప్రాజెక్ట్స్ చీఫ్ డి.శ్రీధర్ బాబు ఎస్కీ హెడ్స్ ఆఫ్ డిపార్టుమెంట్స్ డాక్టర్యుఎస్.జ్యోతి, ఈ రామ కిషోర్, అనిత అగర్వాల్, సంవేష్ కుమార్, మోహన్ పాల్గొన్నారు.

Also Read: Viral Video: ఎంతకి తెగించార్రా బాబు.. రీల్స్ మాయలో పడి నిండు నూరేళ్ల జీవితం బలి.. వీడియో వైరల్

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×