E-Paper
Advertisement

Etala Rajendar : గజ్వేల్ లో గెలుపు నాదే.. ఈటల ధీమా..

Etala Rajendar :  గజ్వేల్ లో గెలుపు నాదే.. ఈటల ధీమా..

Etala Rajendar : తెలంగాణలో గజ్వేల్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది సీఎం కేసీఆర్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ నుంచి మరోసారి గులాబీ బాస్ బరిలోకి దిగుతున్నారు. అలాగే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ లో గెలుపు నమ్మకం లేక కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

గజ్వేల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉండటం ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తానని గతంలో చాలాసార్లు ఈటల ప్రకటించారు. చెప్పినట్టే గజ్వేల్ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

వర్గల్‌ సరస్వతీ దేవి ఆలయంలో ఈటల ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. గజ్వేల్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా గజ్వేల్‌లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

గజ్వేల్‌లో బీజేపీ సమావేశాలకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారని ఈటల ఆరోపించారు. దావతులు ఇచ్చి, పైసలు పంచి రాకుండా నిలువరిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక సమయంలోనూ ఇలానే చేశారని విమర్శించారు. కానీ ప్రలోభాలకు హుజూరాబాద్‌ ప్రజలు పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ఉద్యమ బిడ్డను గెలిపించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌లో అలాంటి ఫలితమే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడాలని గజ్వేల్‌ ప్రజలను ఈటల కోరారు.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×