BigTV English

Nalini : నాడు తెలంగాణ కోసం ఉద్యోగం త్యాగం.. నేడు అధ్యాత్మికమార్గం.. సీఎంతో నళిని భేటీ..

Nalini

Nalini : నాడు తెలంగాణ కోసం ఉద్యోగం త్యాగం.. నేడు అధ్యాత్మికమార్గం.. సీఎంతో నళిని భేటీ..

Nalini : తెలంగాణలో 2012లో ఉద్ధృతంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో మారుమోగిన పేరు డీఎస్పీ నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే తన అన్నాచెల్లెళ్లపై లాఠీ చార్జ్ చేయలేనని ఆమె పైఅధికారులకు తేల్చి చెప్పి తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేశారు. అనంతరం ఆమె ఉద్యమంలో భాగమయ్యారు.


రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఇప్పుడు నళిని భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని, నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రేవంత్ రెడ్డి కూడా నళిని గురించి ఆరా తీశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×