BigTV English
Advertisement

Maoists Encounter: మణుగూరులో టెన్షన్.. పౌరహక్కుల నేతల అరెస్ట్

Maoists Encounter: మణుగూరులో టెన్షన్.. పౌరహక్కుల నేతల అరెస్ట్

– ఈనెల 5న రఘునాథపాలెంలో ఎన్‌కౌంటర్
– నిజనిర్ధారణకు వెళ్లిన పౌరహక్కుల నేతలు
– అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– అశ్వాపురం పీఎస్‌కు తరలింపు


Fact Finding Team: ఈనెల 5న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న కూడా ఉన్నాడు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహించినట్టు పోలీసులు తెలిపారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 50కి పైగా కేసులు ఉన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణతో కలిసి 14 మంది రఘునాథపాలెం వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. వీరిని మణుగూరు దగ్గర ఆపి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీఎస్ గేట్‌కు తాళం వేశారు. మీడియాకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దీంతో పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై పౌర హక్కుల నేతలు మండిపడుతున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ దీనిపై స్పందిస్తూ, 15 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని, అక్కడ అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిజనిర్ధారణ అనేది 50 ఏళ్ల నుంచి జరుగుతున్నదేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఎన్‌కౌంటర్ జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు హరగోపాల్.

Also Read: Indian Railways: మన దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా ఉండాల్సిందే


ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్‌లోని పువ్వర్తి పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా పోలీసు భద్రతా శిబిరంపై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. యూబీజీఎల్ రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో ప్రతిఘటించలేక మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. సుక్మా జిల్లా జాగురుగుండ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పువ్వర్తిలో ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.

Related News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీ, ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Rain Alert: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Drugs Case: డాక్టర్‌ ఇంట్లో భారీగా డ్రగ్స్‌.. రూ.3 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Holiday: గుడ్‌న్యూస్.. రేపు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ఆమోద ముద్ర, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నా..

Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం రూ.99 కోట్లు

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Big Stories

×