E-Paper
Advertisement

ఫేక్ ఫోన్ పే స్కామ్.. 97 వేల బంగారంతో నిందితుడు జంప్.. ఇదిగో వీడియో!

ఫేక్ ఫోన్ పే స్కామ్.. 97 వేల బంగారంతో నిందితుడు జంప్.. ఇదిగో వీడియో!
Advertisement

PhonePe Scam: డిజిటల్ చెల్లింపులు పెరిగాక వ్యాపారులు, సామాన్యులు ఎంత హాయిగా ఫీలవుతున్నారో.. అంతే స్థాయిలో సైబర్ నేరగాళ్ళు, మోసగాళ్ళు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని అమాయకులను ముంచేసే ఘటనలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసిన ఒక ఘరానా మోసం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

క్షణాల్లో జరిగింది.. రాజేష్ స్కెచ్ ఇదిగో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ జ్యువెలరీ షాపుకి రాజేష్ అనే వ్యక్తి కస్టమర్ లాగా వచ్చాడు. షాపు యజమానురాలితో చాలా పద్ధతిగా మాట్లాడుతూ, రకరకాల మోడల్స్ చూశాడు. చివరికి సుమారు రూ. 97,000 విలువైన బంగారు ఆభరణాలను నచ్చించుకుని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు. బిల్లు చెల్లించే సమయం రాగానే, తన వద్ద నగదు లేదని.. ఆన్‌లైన్ లో ఫోన్ పే ద్వారా డబ్బులు పంపుతానని నమ్మబలికాడు.

Advertisement

ఫేక్ యాప్‌తో బురిడీ.. నోటిఫికేషన్ రాకముందే జంప్
షాపు యజమానురాలికి క్యూఆర్ కోడ్ చూపించమని చెప్పి, తన మొబైల్‌లోని ‘ఫేక్ ఫోన్ పే’ యాప్ ద్వారా డబ్బులు పంపినట్లు నటించాడు. ఆ యాప్‌లో డబ్బులు విజయవంతంగా ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఒక నకిలీ స్క్రీన్ ప్రత్యక్షమైంది. దాన్ని యజమానురాలికి చూపించి, అక్కా డబ్బులు పడిపోయాయి చూడండి అని చెప్పాడు. షాపు యజమానురాలు తన ఫోన్‌కు మెసేజ్ వచ్చిందో లేదో సరిచూసుకునే లోపే.. ఆ నిందితుడు క్షణాల్లో నగలతో సహా బయట సిద్ధంగా ఉన్న తన బైక్‌పై కాళ్ళకు బుద్ధినెప్పాడు.

పోలీసుల రంగప్రవేశం.. సీసీటీవీల ఆధారంగా గాలింపు!
బాధితురాలు ఎంతసేపు వేచి చూసినా తన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమవుకపోవడంతో పాటు, సదరు వ్యక్తి హడావుడిగా వెళ్లిపోవడంపై అనుమానం వచ్చి వెంటనే జూలూరుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. షాపులోని, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, బైక్ నెంబర్, నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

వ్యాపారులు జాగ్రత్త! మీ ఫోన్‌లో మెసేజ్ వస్తేనే నమ్మండి
ఈ తరహా ఫేక్ పేమెంట్ యాప్‌ల మోసాలు ఇటీవల బాగా పెరిగిపోయాయి.

మెసేజ్ కన్ఫర్మేషన్: కస్టమర్ ఫోన్ చూసి మోసపోకండి. మీ సొంత ఫోన్‌కి బ్యాంక్ నుంచి ‘కలిగిన జమ’ మెసేజ్ లేదా నోటిఫికేషన్ వస్తేనే సరుకులు ఇవ్వండి.

సౌండ్ బాక్స్ వాడకం: షాపుల్లో Paytm లేదా PhonePe ‘సౌండ్ బాక్స్’ ఏర్పాటు చేసుకుంటే వెంటనే వాయిస్ అలర్ట్ వస్తుంది కాబట్టి ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

Also Read: స్పీడందుకుంటున్నాయ్ లగ్జరీ ప్రయాణాలు.. విజయవాడ ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ ధమాకా!

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×