E-Paper
Advertisement

హైడ్రాపై హైకోర్టు సమన్లు? సీఎం రేవంత్ రెడ్డి పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ నోటీసు!

హైడ్రాపై హైకోర్టు సమన్లు? సీఎం రేవంత్ రెడ్డి పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ నోటీసు!
Advertisement

Fake High Court Summons :తెలంగాణలో హైడ్రా (HYDRAA) కూల్చివేతల అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం తీవ్ర దుమారం రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌లకు తెలంగాణ హైకోర్టు సమన్లు జారీ చేసిందంటూ ఒక నోటీసు నెట్టింట వైరల్ అయ్యింది. అయితే, ఈ నోటీసు పూర్తిగా నకిలీ (Fake) అని తేలింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైరల్ అయిన ఆ నకిలీ పత్రంలో.. ఏప్రిల్ 12, 2026 తేదీన హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నుండి అర్జెంట్ జ్యుడీషియల్ నోటీసు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కూల్చివేతల్లో నిబంధనలు పాటించలేదని, బాధితుల హక్కులను కాలరాశారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆ ఫేక్ నోటీసులో సృష్టించారు. అంతేకాకుండా, కూల్చివేసిన ఆస్తుల వివరాలను తక్షణమే సమర్పించాలని కోర్టు ఆదేశించినట్లుగా ఆ పత్రాన్ని రూపొందించారు.

Advertisement

హైకోర్టు పేరుతో ఇలాంటి తప్పుడు పత్రాలను సృష్టించి ప్రభుత్వంపై విషప్రచారం చేయడంపై కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత న్యాయస్థానం పేరును వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం నేరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫేక్ నోటీసుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఈ తప్పుడు నోటీసును ఎవరు సృష్టించారు? ఏయే సోషల్ మీడియా గ్రూపుల్లో ఇది వైరల్ అయ్యింది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఫేక్ నోటీసులను సర్క్యులేట్ చేసే వారిపై ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా తన విధులను చట్టప్రకారమే నిర్వహిస్తోందని, ఇలాంటి అవాస్తవ ప్రచారాలతో తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది.

Advertisement

Read Also: 1986 చట్టం రద్దు చేస్తూ సర్కార్ సంచలన గెజిట్.. అమల్లోకి కొత్త చట్టం..?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×