Seethakka: మేడారంలోని హరిత హోటల్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనను అత్యంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. గద్దెల ప్రాంగణ ప్రారంభంతో ఒక చారిత్రక ఘట్టం ముగిసిందని.. ఇది మేడారం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ బుధవారం జరగనున్న మండే మెలిగే పండుగ నుంచి నిండు పండగ వరకు ఇదే ఉత్సాహం సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తల్లులైన సమ్మక్క–సారలమ్మల కీర్తిని ప్రపంచానికి చాటేలా విస్తృతంగా కవరేజ్ చేసిన మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేడారంలోనే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. సాధారణంగా హైదరాబాదులో జరిగే క్యాబినెట్ సమావేశాన్ని అడవిలో నిర్వహించడం ఒక ప్రత్యేక అనుభవమని.. కేవలం సమావేశమే కాకుండా సీఎం కుటుంబం, మంత్రుల కుటుంబాలు కూడా ఇక్కడే రాత్రి బస చేయడం మేడారానికి ప్రత్యేక గౌరవమని చెప్పారు.
రెండు రోజుల పాటు యావత్ క్యాబినెట్ మేడారంలోనే ఉండి.. ఇక్కడే క్యాబినెట్ సమావేశం నిర్వహించి 143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ప్రకటించడం ములుగు జిల్లాకు గర్వకారణమని మంత్రి సీతక్క అన్నారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు.. హోంగార్డుల నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి సీఎం పర్యటనను, క్యాబినెట్ సమావేశాన్ని విజయవంతం చేశారని ప్రశంసించారు. నిన్న క్యాబినెట్ సమావేశం, నేడు గద్దెల ప్రాంగణ ప్రారంభోత్సవం, సీఎం, మంత్రుల దర్శనాల సందర్భంగా ఎలాంటి చిన్న లోపం కూడా జరగలేదని తెలిపారు.
స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ కీర్తి, స్ఫూర్తిని మనసులో నింపుకొని మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనే లక్ష్యంతో.. సీఎంతో పాటు పెద్ద ఎత్తున మహిళలకు దర్శనాలు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళలకు మరింత ఆత్మవిశ్వాసం, ప్రేరణనిచ్చిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ALSO READ: నువ్వెవ్వడివి మా పార్టీ వ్యవహారాల్లో మాట్లాడడానికి?.. సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన, కేబినెట్ సమావేశం విజయవంతం కావడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గద్దెల ప్రాంగణ ప్రారంభోత్సవంతో ఒక కీలక ఘట్టం ముగిసిందని, ములుగు జిల్లాకు గర్వకారణంగా రూ. 143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు… pic.twitter.com/0nOcZBtCDI
— ChotaNews App (@ChotaNewsApp) January 19, 2026