Big Stories

FarmHouse phone call : ఫామ్ హౌజ్ ఫోన్ కాల్ లీక్.. ఆడియో వైరల్.. బీజేపీ బుక్?

FarmHouse phone call : బిగ్ బ్రేకింగ్. అనుకున్నట్టే అయింది. అధికారపార్టీ మరో పావు కదిపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసిన ఫోన్ కాల్ ను లీక్ చేసింది. ఆ ఆడియోలో ఎమ్మెల్యేల డీల్ విషయం స్పష్టంగా ఉంది. అంతా ఢిల్లీ నుంచి రామచంద్ర భారతి డైరెక్షన్ లోనే జరిగిందని ఫోన్ కాల్ సంభాషణను బట్టి తెలుస్తోంది.

- Advertisement -

ఆ ఆడియో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. రామచంద్రభారతి, నంద కుమార్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల మధ్య జరిగింది ఆ ఫోన్ సంభాషణ. స్వామీజీ ఒత్తిడి మేరకు నంద కుమార్ ఈ ప్రపోజల్ తెచ్చినట్టు తెలుస్తోంది. డీల్ కు పైలెట్ రోహిత్ రెడ్డి ఓకే చెప్పగా.. ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వస్తారంటూ ఫోన్ లో రామచంద్రభారతికి నంద కుమార్ చెబుతున్నారు. అయితే, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు? వారి పేర్లు చెప్పమంటూ స్వామీజీ అడిగితే.. వారి పేర్లు ఇప్పుడే చెప్పలేనని.. ఆ విషయాలు మీరు కలిసినప్పుడు చెబుతానని నందకుమార్ అన్నారు.

- Advertisement -

నందకుమార్ ను భయపడాల్సిన పనిలేదని.. కేంద్రం నుంచి ప్రొటెక్షన్ ఉంటుందంటూ రామచంద్రభారతి హామీ ఇచ్చారు. ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని.. రక్షణ కూడా కల్పిస్తామని నందుకు అభయం ఇచ్చారు రామచంద్రభారతి. ఇలాంటి విషయాల్లో తమకు బెంగాల్ లో బాగా అనుభవం ఉందని.. డోంట్ వర్రీ అంటూ స్వామీజీ చెబుతుండటం ఆసక్తికరం. బీఎల్ సంతోష్ మొత్తం చూసుకుంటారని.. నెంబర్1, నెంబర్ 2 ఆయన ఇంటికే వచ్చి అన్నీ తెలుసుకుంటారని అన్నారు.

రామచంద్రభారతి, నంద కుమార్, రోహిత్ రెడ్డి.. ఆ ముగ్గురూ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతున్న ఆడియోలో మరిన్ని సంచలన విషయాలు ఉన్నాయి. ఒకసారి నేరుగా కలుద్దాం అని రోహిత్ రెడ్డి అడగ్గా.. హైదరాబాద్ లో కాకుండా వేరే ప్లేస్ చూడండంటూ రామచంద్రభారతి సూచించారు. అయితే, మునుగోడు ఎలక్షన్ వల్ల నిఘా ఉంటుందని.. హైదరాబాద్ లోనైనేతే సేఫ్ అని రోహిత్ రెడ్డి అన్నారు. ఎప్పుడు కలుద్దాం అంటే.. ఈనెల 24 తర్వాత తాను హైదరాబాద్ వస్తానని అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందామని రామచంద్రభారతి రోహిత్ రెడ్డికి చెప్పారు. మీతో మాట్లాడమని నంద కుమార్ ను తానే ఒత్తిడి చేశానని స్వామీజీ చెప్పారు. రోహిత్ రెడ్డితో పాటు వచ్చే ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు చెప్పమని రామచంద్రభారతి ఎంత అడిగినా.. నందు కానీ, రోహిత్ రెడ్డి కానీ వారి పేర్లు ఇప్పుడే వెళ్లడించలేమని అన్నారు. అయితే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేలా ఉంటుందని.. తొందరగా జాయిన్ అయితే బెటర్ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సూచించారు రామచంద్రభారతి. ఇదీ ఆ ముగ్గురి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ.

అయితే, ఆ ఆడియోలో ఎక్కడా బీజేపీ ప్రస్తావన రాకపోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్. కేంద్రం, బెంగాల్ ప్రస్తావన రావడం.. ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ లాంటి హామీలు ఇవ్వడం చూస్తుంటే రామచంద్రభారతి వెనకాల బీజేపీ ఉండి ఉండవచ్చనే అనుమానం కలుగుతోందని అంటున్నారు. ఇక బీఎల్ సంతోష్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో బీజేపీ ఇరుక్కున్నట్టే కనిపిస్తోంది. ఇక నెంబర్ 1, నెంబర్ 2 అంటే.. ఇంకెవరు మోదీ, అమిత్ షానే అంటున్నారు. అయితే, ఎక్కడా డైరెక్ట్ గా బీజేపీ పేరు వినిపించకపోవడం కమలనాథులకు కాస్త ఊరట ఇచ్చే అంశం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News