మాట జారితే చాలా ప్రమాదం.. వెనక్కి తీసుకోవటం చాలా కష్టం అని మన పెద్దలు అంటుంటారు. ఇప్పుడా విషయం డీఎంకే నాయకుడు సయ్యద్ సాధిక్‌కి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఆయన ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళ్తే.. సయ్యద్ సాధిక్ డీఎంకే స్పోక్స్ పర్సన్. రీసెంట్‌గా ఓ వేదికపై ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీని విమర్శించారు. ఆ సందర్భంలో ఆ పార్టీకి చెందిన మహిళా లీడర్స్ ఖుష్బూ, గౌతమి, నమిత, గాయత్రీ రఘురామన్‌లను ఐటెమ్స్ అని ఘాటు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బీజేపీ వర్గాలు ఆందోళనలు చేశాయి. మహిళలను అంత చులకనగా మాట్లాడుతారా? అని డీఎంకే లీడర్స్ సైతం సాధిక్‌పై ఫైర్ అయ్యారు. సాధిక్ వ్యాఖ్యలపై నటి ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు.
ఖుష్బూకి డీఎంకే మహిళా నేత కనిమొళి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెబుతూ సాధిక్ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘మహిళలను దుర్బాషలాడేవారు, ఎలాంటి వాతావరణంలో పుట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారే మాతృత్వాన్ని కూడా అవమానిస్తారు. ఇదేనా స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిత సంస్కృతి’’ అని ఖుష్బూ ట్విట్టర్‌లో వేసిన ప్రశ్నకు కనిమొళి సమాధానం చెప్పార.
సయ్యద్ సాధిక్ సైతం క్షమాపణలు చెప్పారు. తాను ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై, డీఎంకే లీడర్స్‌ను పందులతో పోల్చారని, జర్నలిస్టులను కోతులన్నారని దీనిపై ఎవరు ఎందుకు మాట్లాడటం లేదన్నారు సాధిక్.