BigTV English

Jeedimetla: లైంగికంగా వేధించిన తండ్రి.. సహాయం పేరుతో మరో వ్యక్తి అత్యాచారం

Jeedimetla: లైంగికంగా వేధించిన తండ్రి.. సహాయం పేరుతో మరో వ్యక్తి అత్యాచారం

Jeedimetla: కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాటు వేస్తే తన బాధను ఎవరికి చెప్పుకుంటుంది. ఓ తండ్రి కూతురిని లైంగికంగా వేధించాడు. అతని చెర నుంచి తప్పించుకోడానికి వేసిన అడుగు మరింత ప్రమాదానికి గురి చేసింది. జీడిమెట్ల ఇన్ స్పెక్టర్ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్‌కు చెందిన ఓ కుటుంబం పొట్టకూటికోసం వలస వచ్చి కుత్బుల్లాపూర్‌ విలేజ్‌లో నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన పెద్ద కుమార్తె (18) తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. కరోనా కారణంగా చదువు మాని ఇంటి వద్దే ఉంటోంది.


ఈ క్రమంలో ఆమె తండ్రే కామాంధుడిలా మారాడు. రక్తం పంచుకు పుట్టిన కూతురన్న విచక్షణ లేకుండా అత్యాచారానికి తెగబడ్డాడు. లైంగికంగా వేధించి, పలుమార్లు అత్యాచారం చేసి.. ఎవరికి చెప్పొద్దు అని బెదిరించాడు. యువతి తన తండ్రి వేధింపులను భరించలేక తల్లికి చెప్పింది. తండ్రిపై లేనిపోనివి చెప్పొదంటూ తల్లి మందలించింది. గతేడాది దీపావళికి వీరు బీహర్ నుంచి కుత్బుల్లాపూర్ రైలులో వస్తున్న సమయంలో సంతోష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఇద్దరు చాట్ చేసుకున్నారు. అతను బడంగ్ పేట గాంధీనగర్ లో ఉంటున్నట్లు చెప్పాడు. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.

గతేడాది డిసెంబర్ 26న సంతోష్ కలవాలని కోరడంతో.. యువతి సికింద్రాబాద్ వెళ్లి అతడిని కలిసింది. ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్ బండ్ తిరిగారు. తర్వాత సంతోష్ ఆమెను కుత్బుల్లాపూర్ లో వదిలి వెళ్లాడు. తన తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లినందుకు కొడతారనే భయంతో ఆమె తిరిగి సికింద్రాబాద్ స్టేషన్ కి పారిపోయింది. సికింద్రాబాద్ లో రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకుని సంతోష్ కి ఫోన్ చేసింది. సంతోష్ ఇంటికి రమ్మన్నాడు. రవి సాయంతో సంతోష్ ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు ఆమెను ఇంటికి వెళ్లమని సంతోష్ చెప్పాడు.


తనకు సాయం చేసిన రవిని తనకు ఉద్యోగం ఇప్పించమని యువతి కోరింది. రవి సరేనంటూ అమీన్ పూర్ లోని తన గదికి తీసుకువెళ్లాడు. రెండు రోజులు యువతి రవి గదిలోనే ఉంది. డిసెంబర్ 29న రవి మద్యం మత్తులో ఆమె పై లైంగిక దాడి చేశాడు. మరుసటిరోజు యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి పిలిచింది. అక్కడే వారికి జరిగిన విషయం వివరించింది. తల్లిదండ్రులు ఆమెతో కలిసి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తనపై జరిగిన అన్ని దారుణాలను పోలీసులకు తెలిపింది. యువతి తండ్రితో పాటు రవి పై అత్యాచారం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×