BigTV English

Toxic: రాఖీభాయ్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి ఏకంగా ఆ హీరోయిన్..?

Toxic: రాఖీభాయ్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి ఏకంగా ఆ హీరోయిన్..?
Advertisement

Toxic: రాకింగ్ స్టార్ యశ్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రానికి గానూ ‘టాక్సిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి మళయాల నటి, దర్శకురాలు నీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంకోసం ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న సినీ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంలోని నటీనటులు, టెక్నీషియన్స్ విషయంలో మేకర్స్ పగడ్భందీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్‌ను విదేశాల నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. అలాగే ఈ మూవీలో హీరోయిన్‌ కోసం కూడా మేకర్స్ చాలామంది తారలను పరీశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటి నటించబోతోందని శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో కేజిఎఫ్-2 చిత్రంలో రమికా సేన్ పాత్రలో నటించి ఎంతో ఆకట్టుకుంది బాలీవుడ్ నటి రవీనా టాండన్‌. ఈ సినిమాతో ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో టాక్సిక్ సినిమా కోసం మరో బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్‌ని యశ్‌కి జోడిగా నటించేందుకు తీసుకోబోతున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఫుల్ యాక్షన్ మోడ్‌లో డ్రగ్స్ నెట్వర్క్ చుట్టూ తిరిగే కథాంశం అన్నట్లుగా ఇటీవల విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది..


Tags

Related News

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Big Stories

×