BigTV English

Kamareddy: కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 కోట్ల ఆస్తినష్టం

Kamareddy: కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 కోట్ల ఆస్తినష్టం

Kamareddy: కామెరెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్థరాత్రి 11.30 గంటల సమయంలో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో మాల్ లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.


జేసీబీ సహాయంతో షాపింగ్ మాల్ షట్టర్లను తొలగించి మంటలను ఆర్పివేశారు. ఉదయం 7 గంటల వరకూ రెండు అంతస్తుల్లో మంటలు అదుపులోకి రాగా.. మిగతా రెండంతస్తుల్లో మంటలు పూర్తిగా అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో సుమారు రూ.8-10 కోట్ల వరకూ ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా షాపింగ్ మాల్ కు నిప్పంటించారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో షాపింగ్ మాల్ పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×