BigTV English

Karimnagar: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్లు..

Karimnagar: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్లు..

Fire Accident In Karimnagar: తెలంగాణలోని కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది.
వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. వారంతా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇక్కడ మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారి మంటలు చెలరేగాయి. భారీ మంటలు ఎగిసి పడ్డాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి.


పూరిళ్లలోని 5 గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ప్రమాద సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

Read More: బ్లడ్ బ్యాంకుల్లో ప్లాస్మా దందా.. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ సెంటర్లు సీజ్


జగిత్యాల రహదారిలోని సుభాష్ నగర్ లో కార్మికుల కుటుంబాలు నివసిస్తున్నాయి. పూరిళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. వారంతా మేడారం జాతరకు తరలివెళ్లారు. ఈ సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఆ గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పూరిళ్లు మాత్రం కాలిబూడిదయ్యాయి.

Tags

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే.. గ్రామాల్లో అడుగుపడదు

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×