E-Paper
Advertisement

Plasma Business in Blood Banks: బ్లడ్ బ్యాంకుల్లో ప్లాస్మా దందా.. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ సెంటర్లు సీజ్!

Plasma Business in Blood Banks: బ్లడ్ బ్యాంకుల్లో ప్లాస్మా దందా.. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ సెంటర్లు సీజ్!
Advertisement
Plasma Business in Blood Banks

Plasma Business in Blood Banks: బ్లడ్ బ్యాంక్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బ్లడ్‌ బ్యాంక్‌ల ద్వారా ప్లాస్మా దందా చేస్తున్నారన్న పక్కా సమాచరంతో ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో ల్యాబొరేటరీస్‌లో అక్రమంగా నిల్వ చేసిన హ్యూమన్ ప్లాస్మా, హోల్ హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ సీరోమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మదీనగూడలోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ సెంటర్, దారుల్‌షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్‌ను సీజ్ చేశారు. అలాగే మూసాపేటలోని హేమో సర్వీస్‌ ల్యాబొరేటరీస్‌ కంపెనీలోనూ సోదాలు జరిపారు. ఫ్రీజర్లలో నిల్వ చేసిన బ్లడ్ ప్యాకెట్లు, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధననలకు విరుద్దంగా గత 8 ఏళ్లుగా రాఘవేంద్రరావు ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

Advertisement

Read More: యూసుఫ్‌గూడలో యువకుడి వీరంగం.. ట్రాఫిక్‌ పోలీసుపై దౌర్జన్యం

మదీనాగూడలోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, దారుల్‌షిఫాలోని న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూల్‌లోని ఆర్‌ఆర్ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన బ్లడ్ బాటిల్స్‌ను మూసాపేటలోని భవానీ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో నిల్వ చేసి.. వాటిని మళ్లీ ప్యాక్‌ చేసి విక్రయాలు జరుపుతున్నట్టు నిర్ధారించారు. రాఘవేంద్రనాయక్ ఇతర బ్లడ్ బ్యాంక్ నుంచి 150 ఎంఎల్ హ్యూమన్ ప్లాస్మా బ్యాగ్‌ను 7 వందల రూపాలయకు కొనుగోలు చేసి.. దానిని తిరిగి ప్యాకింగ్ చేసి ఇతర కంపెనీలకు 3వేలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించారు. 2016 నుంచి 6 వేల యూనిట్ల కంటే ఎక్కువ రక్తాన్ని సేకరించి, విక్రయించినట్టు అధికారులు తెలిపారు.

Tags

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×