Charlapalli Railway Station Fire: హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్ లో నిలిపి ఉంచిన ఖాళీ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఫ్లాట్ ఫామ్ నెం.5, 6 మధ్య రైలు నిలిపి ఉంచిన సందర్భంలో ఒక్కసారి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన స్టేషన్ అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖాళీగా ఉన్న కోచ్ కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Also Read: ఎస్‌ఐఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్.. ఈసీఐకి 48 ప్రశ్నలు!
ప్రమాద ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. సాయంత్రం సరిగ్గా 6.35కి ఖాళీ రైలులో మంటలు వచ్చినట్లు తెలిపింది. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి 7.15 గంటలకు మంటలను కంట్రోల్ చేశాయని తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ఘటనపై విచారణ జరుగుతోందని తెలియజేసింది. అయితే రైలు చివరి బోగీల్లో మంటలు చెలరేగగా.. అగ్నికీలలు ఇతర బోగీలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అడ్డుకోవడంతో భారీ ఆస్తి నష్టం తప్పింది.
చర్లపల్లి రైల్వే స్టేషన్ లో మంటల్లో తగల బడుతున్న భోగీలు..
#charlapalli #RailwayStation #FireAccident https://t.co/iSyhLstrzF— 𝕍𝔸ℝ𝕊ℍ𝔸𝔹𝕋𝕊 (@varshabts999) November 16, 2026
Also Read: తండ్రిపై దాడికి ప్రతీకారం.. హోటల్‌పై అక్కాచెల్లెళ్ల దాడి.. చుక్కలు చూపించేశారు భయ్యా!