Grindr Robbery: గ్రైండర్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచుకుని వరుస దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేయాగా మరో వ్యక్తి పారారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గ్రైండర్ యాప్‌లో బాధితులను గుర్తించి ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్‌తో పరిచయం పెంచుకుంటున్నారు. దీంతో భాదితుల వద్ద బంగారు ఆభరణాలు ఉన్నాయా? ఒంటరిగా ఉంటున్నారా? అంటూ ముందుగానే ఆరా తీస్తునట్టు పోలీసులు గుర్తించారు.
నమ్మకం కుదిరిన తర్వాత బాధితుల ఇళ్లకు వెళ్లి దోపిడీలకు ప్లాన్ చేస్తున్నారు. బీర్‌లో మత్తు పదార్థాలు కలిపి బాధితులకు ఇచ్చిన నిందితులు బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత బంగారు గొలుసులు, ఉంగరాలు, విలువైన వస్తువుల చోరీ చేసి పరారవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల దృష్టి మళ్లించి దోపిడీలకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడించారు. అయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ముగ్గురు నిందితులను ఉప్పల్ పోలీసులు పట్టుకున్నారు. ఏఎస్ రావు నగర్‌లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కుషాయిగూడ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 361 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే వీరికి మొత్తం 14 కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 2, సైబరాబాద్‌లో 7, హైదరాబాద్‌లో 3, విశాఖపట్నంలో ఒక కేసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు చందు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల మొబైల్ ఫోన్లు, గ్రైండర్ యాప్ ప్రొఫైల్స్, చాటింగ్స్, కాల్ డేటాపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులు, డిజిటల్ ఆధారాలతో నిందితుల నేరాలను పోలీసులు అనుసంధానం చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
Also read: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!