Animated Adventure OTT: యానిమేషన్ సినిమాలు అంటే కేవలం పిల్లలకు మాత్రమే వినోదాన్ని అందించేవి అనుకుంటే పొరబడినట్లే. వాటిలో అద్భుతమైన అడ్వెంచర్, కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు పెద్దలను కూడా కదిలించే భావోద్వేగాలు ఉంటాయి. అలాంటి అన్ని అంశాలను కలగలిపి రూపొందించిన అద్భుతమైన యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీ ‘పుస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్’ (Puss in Boots: The Last Wish). ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో టాప్ రేటింగ్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో తొమ్మిది ప్రాణాలున్నాయని ధీమాగా తిరిగే పిల్లి (పుస్) కి చివరకు ఎదురైన ప్రమాదం ఏంటి? తన చివరి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తను చేసిన సాహసం ఎలాంటిది? దీనిని ఏ ఓటీటీలో చూడచ్చో తెలుసుకుందాం పదండి.
పుస్ ఇన్ బూట్స్ (ఆంటోనియో బాండెరాస్) ఒక సాహసవీరుడు. ప్రమాదాలకు ఎదురెళ్లడం, శత్రువులతో పోరాడటం అతడికి చాలా సరదా. పిల్లులకు తొమ్మిది ప్రాణాలు ఉంటాయనే నమ్మకంతో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎన్నో సాహసాలు చేస్తుంటాడు. కానీ అతడి నిర్లక్ష్యం, అతిగా రిస్క్ తీసుకునే స్వభావం వల్ల అప్పటికే ఎనిమిది ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రాణం. దీంతో తొలిసారి అతడికి చావు భయం పట్టుకుంటుంది. ఇక సాహసాలకు దూరంగా ఉంటూ సాధారణ పిల్లిలా జీవించాలని నిర్ణయించుకుంటాడు.
అయితే పోగొట్టుకున్న తన ప్రాణాలను తిరిగి పొందేందుకు బ్లాక్ ఫారెస్ట్‌లో ఉన్న మాయా విషింగ్ స్టార్ గురించి అతడికి తెలుస్తుంది. ఆ నక్షత్రాన్ని చేరుకుంటే తన కోరిక నెరవేరుతుందని తెలుసుకున్న పుస్, తన పాత భాగస్వామి కిట్టీ సాఫ్ట్‌పాస్, అమాయకమైన పెర్రిటో తో కలిసి సాహసయాత్ర మొదలుపెడతాడు. కానీ ఆ విషింగ్ స్టార్ కోసం పుస్ మాత్రమే కాదు.. గోల్డిలాక్స్, మూడు ఎలుగుబంట్ల కుటుంబం, జాక్ హార్నర్ కూడా వెతుకుతుంటారు. వీరందరితో పాటు పుస్‌ను వేటాడేందుకు భయంకరమైన తోడేలు రంగంలోకి దిగుతుంది. ఆ తోడేలు సాధారణ శత్రువు కాదు.. మరణానికి ప్రతిరూపంగా పుస్‌ను వెంటాడుతుంది. మరి ఇన్ని ప్రమాదాలను దాటుకుని పుస్ విషింగ్ స్టార్‌ను చేరుకున్నాడా? పోగొట్టుకున్న ప్రాణాలను తిరిగి పొందాడా? లేక తన దగ్గర ఉన్న ఒక్క ప్రాణం విలువను తెలుసుకున్నాడా? అనేది సినిమాలో చూడాల్సిందే.
జోయెల్ క్రాఫోర్డ్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ చిత్రానికి జానుయెల్ మెర్కాడో సహదర్శకుడిగా వ్యవహరించారు. పుస్ ఇన్ బూట్స్‌కు ఆంటోనియో బాండెరాస్, కిట్టీ సాఫ్ట్‌పాస్‌కు సల్మా హాయక్, పెర్రిటోకు హార్వే గిల్లెన్, గోల్డిలాక్స్‌కు ఫ్లోరెన్స్ ప్యూ, జాక్ హార్నర్‌కు జాన్ ములానీ, భయంకరమైన తోడేలుకు వాగ్నర్ మౌరా వాయిస్ అందించారు. 2022 డిసెంబర్ 21న అమెరికాలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 2023 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా నామినేషన్ పొందింది. సుమారు 1 గంట 43 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం JioHotstarలో ఇంగ్లీష్, హిందీ ఆడియోల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదు. దీనికి IMDbలో 7.9/10 టాప్ రేటింగ్ ఉండటం విశేషం.
Read Also: సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్