BigTV English

Girl Dies of Heart Attack: ఆడుతూ ఆడుతూ పైలోకాలకు.. గుండె పోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

Girl Dies of Heart Attack: ఆడుతూ ఆడుతూ పైలోకాలకు.. గుండె పోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

Five-Year-Old Girl Dies of Heart Attack in Karimnagar: మనిషి ఆయుష్షు గుండెపోట్లతో బేజారవుతోంది. వయసుతో సంబంధం లేకుండా క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అప్పటి వరకు కళ్లెదుటే ఆడుకున్న పాపాయి అకస్మాత్తుగా విగతజీవిగా మారింది. కరీంనగర్ జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది.


ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన వయసు.. కష్టం, సుఖం అంటే ఏంటో కూడా తెలియని పసితనం. కానీ ఆ పసిప్రాణం గుండె జబ్బుతో బలైంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా కనిపించిన చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక సెలవంటూ వెళ్లిపోయింది. కరీంనగర్‌ జిల్లాలో మృతి చెందిన ఐదేళ్ల చిన్నారి గుండె జబ్బుతో చనిపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

చిరునవ్వులు చిందిస్తూ ఆడుతున్న ఈ చిన్నారి పేరు ఉక్కులు. వయసు కేవలం 5 సంవత్సరాలే. జమ్మికుంటకు చెందిన రాజు-జమున దంపతుల ముద్దుల కూతురు. ముద్దు ముద్దు మాటలు మాట్లడే తనంటే.. కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టం. ఇరుగుపొరుగువారు కూడా పాపను బాగా ముద్దు చేస్తారు. మంగళవారం ఉదయం నిద్రలేచి పాప.. కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత అమ్మ వద్దకు వచ్చి తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పింది. దీంతో పాపను తల్లి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరీక్షించిన డాక్టర్లు.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హన్మకొండ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వెంటనే పాపను హన్మకొండకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షిస్తుండగానే బాలిక మృతి చెందింది.


Also Read: వెంటపడ్డాడు.. ప్రేమించానన్నాడు.. చివరకు? కానీ ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ తెలిస్తే..

కాగా, పాపకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని.. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారని డాక్టర్లు తెలిపారు. అందువల్లే గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తపరిచారు. ఎంతో ప్రేమగా పెంచుకున్నబిడ్డ మరణవార్త వినగానే ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. గుండెపోటుతో చిన్నారి మృతిచెందిందని తెలియడంతో గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న పాపాయి అకస్మాత్తుగా విగతజీవిగా మారిపోవడంతో.. కుటుంబసభ్యులు గుండె పగిలేలా రోదిస్తున్నారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×