Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీ లు సీరియస్ గా తీసుకున్నాయి… ఎలాగైనా గెలువాలని ఫోకస్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కి ఇది గెలవడం చాలా అవసరం.. దీంతో అభ్యర్థి ఎంపిక పై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశాలపై వరుస సర్వేలు చేయించుకుంటుందంట. అసలు కాంగ్రెస్ లెక్కలేంటి? జూబ్లీ హిల్స్ టికెట్ బీసీ అభ్యర్ధికి కేటాయింస్తుందా? లేదా ఓసీ సామజికవర్గానికే కట్టబెడుతుందా? కాంగ్రెస్ సర్వే లో వినిపిస్తున్న ఈక్వేషన్లు, పేర్లేంటి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అధికార హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ కి ఎంత ముఖ్యమో సిఎం రేవంత్‌రెడ్డి ఇన్ఛార్జ్‌లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలియ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో విజయం సాధిస్తే రానున్న జీహెచ్ఎంసి ఎన్నికలతో పాటు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాల పరంగా అడుగులు వేస్తునే.. పార్టీ అమలు చేస్తున్న పధకాలను ప్రజలోకి తీసుకెళ్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగో ఆయా కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళాలని సీఎం పార్టీ ముఖ్యనేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అదలా ఉంటే బీర్ఎస్ సిట్టింగ్ సీట్ కావడం, వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోవడం వల్ల వస్తున్న ఉప ఎన్నిక కావడంతో.. సానుభూతి ఉంటుంది కాబట్టి మాగంటి భార్య సునీతకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాగంటి గోపినాథ్ కమ్మ సామజికవర్గం అంటే ఓసీ. ఇక బీజేపీ సైతం దాదాపుగా ఓసీ సామజికవర్గానికి చెందిన నేతకే టికెట్ ఇవ్వడానికి సిద్దమైతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బలంగా వినిపిస్తున్న నవీన్ కుమార్ యాదవ్
ఐతే అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత ఏమి లేదు కానీ.. టికెట్ ఎవరి ఇవ్వాలి.. ఏ సామజికవర్గానికి ఇవ్వాలి అనేదే ఇప్పుడు పార్టీ పెద్దలకు ప్రశ్నగా మారిందంట. ఒకవైపు రాష్ట్రం లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అజెండాతో పార్టీ ముందుకు పోతుంది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్‌లోను బీసీ అభ్యర్ధికే టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దాతో బీసీ కోట లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఇందులో నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపించడంతో పాటు, రేసులో నవీన్ యాదవ్ ముందు ఉన్నారు. అలాగే సర్వేల్లో కూడా నవీన్ యాదవ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నట్టు సమాచారం.
ఫ్లెక్సీలతో హడావుడి చేస్తున్న అంజన్‌కుమార్ యాదవ్
మరొకరు అంజన్ కుమార్ యాదవ్ ఈ ఇద్దరు యాదవ సామజికవర్గమే. ఇప్పటికే అంజన్ తానే అభ్యర్థి అని అలాగే జూబ్లీహిల్స్ మొత్తం ఫ్లెక్సీలు పెట్టి హడావుడి చేస్తున్నారు . ఇక మరో టికెట్ ఆశావహుడు బొంతు రామ్మోహన్. ఆయనకు మాజీ మేయర్ గా పని చేసిన అనుభవం ఉంది. మున్నూరుకాపు సామజికవర్గానికి చెందిన ఆయన కూడా జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బొంతు రామ్మోహన్ భార్య యాదవ సామజికవర్గం.. దీంతో బీసీ సామజికవర్గానికి టికెట్ ఇస్తే వీరిలో ఒక్కరికి ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు.
టికెట్ ఆశిస్తున్న రెహ్మాత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి
ఇక బీసీ సామజికవర్గానికి కాకుండా ఓసీ సామజికవర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే రెహ్మాత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్న సిఎన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బలంగా ఆశిస్తున్నారు. బీసీ లకు కాకుండా వేరే సామజివర్గానికి టికెట్ ఇస్తే తనకే వస్తుందని, సర్వే లో కుడా ఆయన పేరు ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. ఇక ఇదే సామజికవర్గం నుండి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఐతే రంజిత్ రెడ్డి పేరు పూర్తి స్థాయిలో ప్రచారం లో లేదు. అలాగే ఆయన ఎమ్మెల్యే టికెట్ కాదు ఎమ్మెల్సీ అడుగుతున్నారని సమాచారం. దీంతో రెడ్డి సామజికవర్గం నుండి సిఎన్ రెడ్డి కే ఎక్కువ అవకాశలు కనిపిస్తున్నాయి.
Also Read: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?
ఇప్పుడు చర్చకు వచ్చిన పేర్లని సర్వే లో కూడా వినిపిస్తున్నాయని, అందరి పేర్లపై కూడా కాంగ్రెస్ ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం. మరి పార్టీ వీరిలో ఎవరికి అధికార పార్టీ టికెట్ దక్కే అవకాశం ఉంది? ఏ సామజికవర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యత ఇస్తుంది? లేదా అందర్నీ కాదని చివరి దశలో కొత్త వారిని రంగంలోకి దించుతుందా? అనేది చూడాలి.
Story By Venkatesh, Bigtv