Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ సమావేశాలకు హాజరవుతారా? గతంలో మాదిరిగా డుమ్మాకొడతారా? అదే జరిగితే ఎమ్మెల్యేల సాలరీలు ఆగిపోతాయా? ఇవే ప్రశ్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఏ విధంగా అడుగులు వేయనున్నారు? అన్నదే అసలు ప్రశ్న.
ఏపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. సమావేశాలను అయితే 10 రోజులు లేకుంటే రెండు వారాల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ-BAC సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్ని రోజులు పెట్టాలనేది నిర్ణయిస్తుంది.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలంతా హాజరు తప్పనిసరి నొక్కి వక్కా నించారు. గైర్హాజరైన వారి జీతాలలో కోత విధిస్తామని ముందుగానే హెచ్చరించారు. స్పీకర్ స్వయంగా సభ్యులంతా హాజరు కావాలని పట్టుబట్టడంతో సభ్యుల హాజరు హాట్ టాపిక్ అయ్యింది. అందరు ఎమ్మెల్యేలు సమావేశాలకు రావాలని తాను కోరుకుంటు న్నానని తెలిపారు.
వారి వారి ప్రాంతాల సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక అవకాశంగా చెప్పారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించడం వైసీపీ ఎమ్మెల్యేల బాధ్యతగా చెప్పారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం మూడు గంటలకు వైసీపీ పార్టీ ఆఫీసులో ఆ పార్టీ శాసనసభా పక్ష సమా వేశం జరగనుంది. జగన్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.
ALSO READ: ఏం చెప్పారు శ్యామలగారు?
అందులో అసెంబ్లీకి వెళ్లాలా? లేకుంటే బహిష్కరించాలా? అనేదానిపై జగన్ చర్చించనున్నారు. సమావేశాలను బాయ్‌కట్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని, సాలరీ వస్తుందని అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఈ లెక్కన బాయ్‌కట్ అస్త్రాన్ని వైసీపీ ప్రయోగించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణలు సహా కీలక ఆర్డినెన్స్‌లను ఈ సమావేశాల్లో ఆమోదించనుంది సభ. నాలా చట్ట సవరణలు, షెడ్యూల్డ్ కులాలు, ఫారెన్ యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి.
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా?
నేడు మధ్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ
సభకు రాని ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలన్న స్పీకర్
తీవ్ర చర్చకు దారితీసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై తీవ్ర ఉత్కంఠ
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా… https://t.co/E1aqE0Yfqm pic.twitter.com/r8GfgdQqmM
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2025