Pakistan vs UAE: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో అంపైర్ కు చుక్కలు చూపించింది పాకిస్థాన్ టీం. ప్రతీ అప్పీల్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ రుచిరా పల్లియగురుగేపై పాకిస్థాన్ ప్లేయర్లు పెద్ద కుట్రకు తెరలేపారు. త్రో కొడుతూ… అంపైర్ రుచిరా పల్లియగురుగేను కొట్టేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న పాకిస్థాన్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పోరాడిన పాకిస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో సూపర్ 4 కు దూసుకెళ్లింది పాకిస్థాన్.
Also Read: Team India : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా అరుదైన రికార్డు… ఇప్పటివరకు ఏ జట్టు సాధించని చరిత్ర
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న పాకిస్థాన్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరుగగా… ఇందులో అంపైర్ కు తీవ్ర గాయం అయింది. పాకిస్థాన్ జట్టుకు చెందిన వికెట్ కీపర్ మహ్మద్ హారిస్ బౌలర్ కు బంతి వేయబోయాడు. అయితే.. అక్కడే ఉన్న అంపైర్ రుచిరా పల్లియగురుగే ఎడమ చెవికి బంతి బలంగా తగిలింది. బంతి వస్తుందని తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ… ప్రమాదం మాత్రం జరిగేసింది. దీంతో.. మ్యాచ్ మధ్యలోనే అంపైర్ రుచిరా పల్లియగురుగే డగౌట్ కు వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన యూఏఈ ప్లేయర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగింది. 5.5 ఆడిన యూఏఈ అప్పటికే 37 పరుగులు చేసి, 3 వికెట్లు నష్టపోయింది. ఈ తరుణంలోనే… అంపైర్ రుచిరా పల్లియగురుగేకు గాయం అయింది.
అయితే.. ఈ సంఘటనపై పాకిస్థాన్ ప్లేయర్లను నెటిజన్లు తప్పుపడుతున్నారు. కావాలనే అంపైర్ రుచిరా పల్లియగురుగేను టార్గెట్ చేసి కొట్టారని ఆరోపణలు చేస్తున్నారు. రిఫరీ ఆండీ విషయంలో ఐసీసీ మాట వినడం లేదని… అంపైర్ రుచిరా పల్లియగురుగే కూడా అప్పీల్ చేస్తే ఔట్ ఇవ్వడం లేదని దాడి చేసినట్లు పాకిస్థాన్ ప్లేయర్ల ఇజ్జత్ తీస్తున్నారు నెటిజెన్స్. గతంలో కూడా ఇదే శ్రీలంకన్ అంపైర్ రుచిరా పైన పాకిస్తాన్ ప్లేయర్లు దాడి చేశారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో… అవుట్ ఇవ్వనందుకుగాను…అంపైర్ రుచిరాను త్రో కొడుతూ గాయపరిచాడు పాకిస్తాన్ ప్లేయర్ కమ్రాన్ అక్మార్ సోదరుడు ఉమర్ అక్మల్. ఇక ఇప్పుడు వికెట్ కీపర్ కూడా అంపైర్ రుచిరాను గాయపరిచారు.
నిన్న యూఏఈ పైన గెలిచిన పాకిస్తాన్ నేరుగా సూపర్ 4 లోకి దూసుకు వెళ్ళింది. దీంతో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మళ్లీ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 21వ తేదీన… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య.. సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. అటు ఇప్పటికే గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్ జట్టును తుక్కు రేగొట్టింది టీమిండియా.
Ruchira Palliyaguruge💀
Umpire whose finger is always up against 🇵🇰-was there in the last #PakVsInd
Swear to God I was hoping that somebody will hit him in the balls, but head works fine for me. 😍#PAKvsUAE https://t.co/MIkFSYOzkF pic.twitter.com/27OydSzcZH— 🦅 (@six_nil) September 17, 2025