Viral Video: ఏం చేస్తావో చేసుకోపో.. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తే, లేదంటే లేదు.. అంటూ ఓ ఫారెస్ట్ అధికారు ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెుల్యేకే ఝలక్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎమ్మెల్యే ఫోన్ చేస్తే.. ఏ అధికారైనా సార్ సార్.. ఎస్ సార్.. అంటూ వణికిపోతుంటారు. కానీ, ఆ అధికారి అలా కాదు. ఏదంటే.. ఏదంటూ రివర్స్ అయ్యారు. గ్రామ సమస్యపై ఓ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే.. బాధ్యతారాహిత్యంగా జవాబు ఇచ్చాడు ఆ అటవీశాఖ అధికారి. జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటన.. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలోకి కొండెంగ వస్తోందని, ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన గ్రామంలోని సభా వేదిక నుంచే నేరుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొండల్ రెడ్డికి ఫోెన్ చేశారు. కొండెంగను పట్టుకోలేకపోతున్నావ్.. గ్రామంలోకి చిరుత వస్తే ఏం చేస్తావంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే.
కొండెంగను గ్రామం నుంచి పట్టుకునేందుకు ట్రై చేస్తున్నామంటూ రేంజ్ ఆఫీసర్ ఎమ్మెల్యేకు చెప్పారు. తాను అడిగింది కొండెంగ గురించి కాదని.. చిరుత పులి వస్తే ఏం చేస్తావంటూ ఎమ్మెల్యే రెట్టించారు. తాను తెలుగులో అడుగుతుంటే.. నువ్వేంది ఇంగ్లీషులో సమాధానం చెబుతున్నావంటూ సెటైర్ కూడా వేశారు. చిర్రెత్తుకొచ్చిన రేంజ్ ఆఫీసర్.. ఈసారి ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.
తాను తెలుగులోనే మాట్లాడుతున్నానని రేంజ్ ఆఫీసర్ చెప్పడంతో.. ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్? అంటూ సీరియస్ అయ్యారు. ఏం చేస్తావో చేసుకో.. మీరు రెస్పెక్ట్ ఇస్తే నేను కూడా ఇస్తా.. అంటూ ఫారెస్ట్ అధికారు కఠువుగా సమాధానం చెప్పారు. ఫోన్ పెట్టేయ్ అంటూ ఎమ్మెల్యే దబాయించగా.. నువ్వే పెట్టేయ్ అంటూ మళ్లీ రివర్స్ కౌంటర్ వేశాడు రేంజ్ ఆఫీసర్. ఇలా వాళ్లిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.