EPAPER

Bathukamma Festival: బతుకమ్మ ఉత్సవాలు.. కవిత దూరం.. రీఎంట్రీ వెనక్కి?

Bathukamma Festival: బతుకమ్మ ఉత్సవాలు.. కవిత దూరం.. రీఎంట్రీ వెనక్కి?

Bathukamma Festival: తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు బుధవారం నుంచి మొదలయ్యాయి. బతుకమ్మ ఉత్సవాలంటే.. కవిత పేరు ముందుగా వస్తుంది. కవిత అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే కవిత అనే విధంగా గడిచిన పదేళ్లు సాగింది. బతుకమ్మకు ప్రాచుర్యం కలిపించేందుకు తీవ్రంగా కృషి చేశారామె. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విదేశాలకు చాటి చెప్పారు కూడా.


తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు నేటి నుంచి మొదలుకానున్నాయి. ఇంతకీ కవితక్క ఎక్కడ? ఈసారి బతుకమ్మ ఉత్సవాలకు పార్టిసిపేట్ చేస్తారా? దూరంగా ఉంటున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల ద్వారా రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది.

ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. మంగళవారం అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. గైనిక్ సమస్యతో బాధపడుతున్న ఆమెకు మెడికల్ పరీక్షల రిపోర్టులను వైద్యులు  పరిశీలించారు. మూడువారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచన చేసినట్టు తెలుస్తోంది. అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.


ఈసారి ఎలాగైనా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని కవితక్క భావించారట. డాక్టర్ సలహా మేరకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అంతర్గత సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టయిన దాదాపు ఆరునెలలపాటు ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఆ సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి డాక్టర్లు సూచన మేరకు మంగళవారం మెడికల్ టెస్టులకు వెళ్లినట్టు తెలుస్తోంది.

ALSO READ:  బతుకమ్మ షెడ్యూల్ విడుదల.. 10న ట్యాంక్ బండ్‌పై సంబురాలు

కొద్దిరోజులుగా కవితక్కను గమనించినవాళ్లు మాత్రం ఆమె ఇక రాజకీయాల్లోకి రారని అంటున్నారు. రుద్రాక్ష ధరించి ఆమె ఆధ్యాత్మికంలోకి వెళ్లారని చెబుతున్నారు. ఈ లెక్కన ఆమె రాజకీయాలకు దూర మైనట్టేనని బీఆర్ఎస్‌లోని ఓ వర్గం మాట.

అనారోగ్య సమస్యల వల్లే దూరంగా ఉన్నారని, మళ్లీ రాజకీయాల్లో యాక్టివేట్ అవుతారన్నది మరికొందరి మాట. బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కవిత కొద్దిరోజులపాటు సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. చివరి రోజు ఈనెల 10న ట్యాంక్‌ బండ్‌పై సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం.

Related News

Cm Chandrababu Chiru : చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరు.. రూ.కోటి చెక్కు అందజేత

CPI Narayana: పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్

Dasara: పండుగ రోజు ఇటువంటి కానుక ఊహించరు కూడా.. ఆల్ ఫ్రీ అంటూ తెగ పంచేశారు.. ప్రజలు క్యూ కట్టారు

Kondareddy Palli : కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ… దసరా గూస్ బంప్స్

CM Revanth Reddy : కొండారెడ్డిపల్లికి మహర్ధశ… మోడల్ విలేజ్’గా సీఎం స్వగ్రామం

Durga Mata Idol Vandalised: విగ్రహం ధ్వంసం కేసులో ఒకరి అరెస్ట్.. ఘటనకు అసలు కారణం చెప్పిన డీసీపీ

Telangana BJP: మొత్తం మార్చండి.. స్పీడ్ పెంచాలి.. పార్టీ అధిష్టానం గురి పెట్టింది.. బీజేపీ ఇంచార్జ్ పాటిల్

Big Stories

×