E-Paper
Advertisement

Maoist Rehabilitation: అడవిలో కాదు.. ఇప్పుడే అసలైన యుద్ధం! కలెక్టర్ ఆఫీసులో మాజీ మావోయిస్టు వసంత!

Maoist Rehabilitation: అడవిలో కాదు.. ఇప్పుడే అసలైన యుద్ధం! కలెక్టర్ ఆఫీసులో మాజీ మావోయిస్టు వసంత!
Advertisement

Maoist Rehabilitation: జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన వినతి నమోదైంది. మాజీ మావోయిస్టు సభ్యురాలు వసంత అలియాస్ మమత సోమవారం కలెక్టర్‌ను కలిసి తన సమస్యలను విన్నవించుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వం నుండి రావాల్సిన రివార్డులు, ఇతర పునరావాస సౌకర్యాల కోసం ఆమె వినతిపత్రాన్ని సమర్పించారు.

వసంత భర్త పసుల రాంరెడ్డి మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం క్రియాశీలకంగా పనిచేశారు. అయితే.. 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో జరిగిన ఓ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఆయన మరణించారు. భర్త మరణించినప్పటికీ.. వసంత వెనకడుగు వేయకుండా పార్టీలోనే కొనసాగారు. దశాబ్దాల కాలం పాటు మావోయిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన ఆమె.. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది 2025 జనవరి 31న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయారు.

Advertisement

ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిన ఆమె.. తన జీవనోపాధి కోసం ప్రభుత్వం నుండి లభించాల్సిన సహాయంపై కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.

ఆమెపై గతంలో ఉన్న రివార్డు సొమ్మును తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల నుండి వెంటనే మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా నివసించడానికి సరైన ఇల్లు లేదని.. తనకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద గృహాన్ని కేటాయించాలని విన్నవించారు. వృద్ధాప్యం, జీవన భృతి కోసం ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.

Advertisement

క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరిస్తూ.. లొంగిపోయిన మాజీ నక్సలైట్ల పునరావాస ప్యాకేజీ కింద తనకు దక్కాల్సిన ఫలాలను త్వరితగతిన అందేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. నిబంధనల ప్రకారం ఆమె విన్నపాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×