E-Paper
Advertisement

Medchal News: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Medchal News: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరం
Advertisement

Medchal News: మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: హకీంపేట్ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో విద్యార్థి శ్రీనాథ్ ఆత్మహత్యయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, షామీర్‌పేట్ సీఐ శ్రీనాథ్ పాఠశాలను సందర్శించి తోటి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆత్మహత్యయత్నం దారితీసిన కారణాలపై విద్యార్థులను ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యం, సిబ్బందితోనూ విచారణ జరిపినట్లు తెలిసింది. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also Read: Allu Sirish Wedding: అల్లు వారింట పెళ్లి సందడి.. పవన్ కళ్యాణ్‌కు వెడ్డింగ్ కార్డ్ అందించిన అల్లు అరవింద్..

పాఠశాల వార్డెన్ నిర్లక్ష్యం

Advertisement

ఇదిలా ఉండగా, విద్యార్థి ఆత్మహత్యయత్నం ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనాథ్ మేనమామ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు సమయానికి సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా ఆటోలో ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Also Read: Maoist Rehabilitation: అడవిలో కాదు.. ఇప్పుడే అసలైన యుద్ధం! కలెక్టర్ ఆఫీసులో మాజీ మావోయిస్టు వసంత!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×