తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో కీలక విభాగమైన ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGTRANSCO) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని తన కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వేదికగా ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1973 అప్రెంటిస్ (సవరణ) చట్టం ప్రకారం ఈ నియామకాలు చేపడుతున్నారు. నిరుద్యోగులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది చక్కని అవకాశం అని చెప్పవచ్చు.
పోస్టుల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిని రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల కింద 125 పోస్టులు కేటాయించారు. అలాగే టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌ల కోసం మరో 125 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సాంకేతిక విద్య పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ రంగ సంస్థలో పని నేర్చుకునే వెసులుబాటు కలుగుతుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 250
విద్యార్హతలు..
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈఈఈ (EEE), ఈసీఈ (ECE), సీఎస్‌ఈ (CSE), మెకానికల్, సివిల్ లేదా ఐటీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
స్టైఫండ్..
ఎంపికైన వారికి స్టైఫండ్ అందజేస్తారు. నెలకు రూ.17,500 స్టైపెండ్ చెల్లిస్తారు.
డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల కోసం సంబంధిత విభాగాల్లో (డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎస్‌సీ) డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వీరికి నెలకు రూ.15,000 స్టైపెండ్ లభిస్తుంది.
వీరు మాత్రమే అర్హులు..
అభ్యర్థులు తమ క్వాలిఫికేషన్ ను 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో పూర్తి చేసిన వారు మాత్రమే ఈ అవకాశానికి అర్హులు అవుతారు. అంతకు ముందు సంవత్సరాల్లో పాస్ అయిన వారు దరఖాస్తుకు అనర్హులుగా ప్రకటించారు.
ఉద్యోగ ఎంపిక విధానం..
ఈ నియామక ప్రక్రియ చాలా సులభంగా పూర్తి చేయనున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఉండవు. అభ్యర్థులు తమ అకడమిక్ కోర్సుల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ సాగుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది.
దరఖాస్తు విధానం..
అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమైంది. NATS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఫిబ్రవరి 26 చివరి తేదీ. అనంతరం టీజీ ట్రాన్స్‌కో అఫీషియల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు పూర్తి చేయడానికి 2026 ఫిబ్రవరి 27 వరకు గడువు ఇచ్చారు.
గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీ ట్రాన్స్‌కో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలని అధికారులు సూచిస్తున్నారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.tgtransco.com
ALSO READ: IDFC First Bank Scam: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో రూ.590 కోట్ల మోసం.. ప్రభుత్వ ఖాతాలతోనే!