BigTV English

Formula E Race Case: ఆ రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారు? ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి.. వాటికి ఆన్సర్స్ లేవా?

Formula E Race Case: ఆ రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారు? ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి.. వాటికి ఆన్సర్స్ లేవా?

Formula E Race Case updates: ఫార్ములా ఈ కారు రేసు కేసులో అసలైన విచారణ మొదలైంది. ఇప్పటివరకు అధికారులను విచారించింది ఏసీబీ. ఇప్పుడు ఏ-1 గా ఉన్న కేటీఆర్ గురువారం ఏసీబీ ముందు హాజరయ్యారు. ఇంటి నుంచి నేరుగా ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. కేటీఆర్ వస్తున్న వాహనాన్ని గురించిన పోలీసులు, గేటు తీసి లోపలికి పంపారు.


కేటీఆర్ తన కారు పార్కింగ్ చేసి ఆఫీసులోకి వెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోకి కేటీఆర్‌ను తీసుకెళ్లారు అధికారులు. లాయర్‌ను పక్క రూమ్‌లో కూర్చోబెట్టారు. 10 నిమిషాల తర్వాత విచారణ అధికారులు కేటీఆర్ రూమ్‌లోకి ఫైల్స్ పట్టుకుని వచ్చారు. కేటీఆర్‌కు మూడు వైపులా ముగ్గురు అధికారులు కూర్చొన్నారు.

తొలుత హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నలు సంధించారు.  ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, దాన కిషోర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించారు. రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారు? బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? నిధుల బదిలీపై ఆర్థికశాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు?


నిధులు బదిలీ చేయాలనీ ఎవర్ని ఆదేశించారా? బలవంతం చేశారా? ఎన్నికల కోడ్ ఎందుకు ఉల్లంఘించారు? అప్పటి సీఎం పర్మిషన్ తీసుకున్నారా? ఏకపక్ష నిర్ణయం ఏ లెక్కన తీసుకున్నారు? అనే ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముభావంగా కూర్చొన్నారట కేటీఆర్. ఆధారాలన్నీ మీరు చేసినట్టే ఉన్నాయని, కచ్చితంగా వివరాలు చెప్పాల్సిందేేనని అన్నారట.

ALSO READ: ఏసీబీ ముందుకు కేటీఆర్.. గుట్టు విప్పిన అరవింద్‌ కుమార్, ఇక మిగిలింది

దీని తర్వాత ఫార్ములా ఈ రేసు నిర్వహణ సంస్థకు అగ్రిమెంట్లు వ్యవహారాన్ని ప్రశ్నించనుంది. తొలుత రేసింగ్ నిర్వహించినప్పుడు నిధులు ఏ విధంగా చెల్లించారు? స్పాన్సర్‌గా గ్రీన్ కో  కంపెనీని ఎవరు ప్రతిపాదించారు? ఎఫ్ఈవో కంపెనీ పెట్టుకుందా? స్పాన్సర్‌గా ఉండాలని మీరు కోరారా? అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సుదీర్ఘంగా కేటీఆర్‌ను విచారించనున్నారు అధికారులు. ఆయన తరపు లాయర్ రామచందరావు లోపలికి వెళ్లారు.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×