Sam Altman Abuse Sister | కృత్రిమ మేధా రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ చాట్ జిపిటిని తీసుకొచ్చిన కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI). ఈ కంపెనీ సీఈఓ అయిన సామ్ ఆల్ట్ మన్ చాలా ఫేమస్. అయితే సామ్ ఆల్ట్ మెన్‌పై ఆయన సోదరి సంచలన ఆరోపణలు చేసింది. దాదాపు పదేళ్లపాటు తనను లైంగిక వేధించాడని తాజాగా కోర్టులో పిటీషన్ వేసింది. 1990వ దశకం నుంచి 2000 దశకం వరకు తామిద్దరం కలిసి మిస్సోరీలోని ఇంట్లో ఉన్నప్పుడు సామ్ తన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఆమెను హింసించాడని పిటీషన్ లో పేర్కొంది.
పిటీషన్ ప్రకారం.. సామ్ ఆల్ట్ మన్ తన సోదరి ‘ఆన్నీ ఆల్ట్‌మెన్’ పై దాదాపు దశాబ్దం పాటు అంటే 1997 నుంచి 2006 వరకు లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు కేవలం 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ఈ వేధింపులు మొదలయ్యాయని ఆరోపించింది. సామ్ ఆల్ట్ మెన్‌కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనపై ఈ ఆకృత్యాలు చేయడం ప్రారంభించాడని తెలిపింది. అత్యాచారంతోపాటు సొడొమి (నోరు, మలద్వారం) కూడా తనను పైశాచికంగా చిత్రహింసలు పెట్టాడని.. ఆన్నీ తన అన్నపై తీవ్ర ఆరోపణలు చేసింది.
ఆమె గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా చేసింది. అయితే కోర్టులో కేసు వేయడం ఇదే తొలిసారి. మిస్సోరి రాష్ట్రంలోని ఈస్ట్రన్ జిల్లా కోర్టులో ఆమె కేసు వేసింది. తనపై ఒక వారంలో పలుమార్లు అత్యాచారం చేయడంతో తాను ఇప్పటికీ మానసికంగా డిప్రెషన్ లో ఉన్నానని.. అందువల్ల తనకు నష్టపరిహారంగా 75,000 డాలర్లు చెల్లించేందుకు తన సోదరుడు సామ్ ఆల్ట్ మెన్ కు ఆదేశించాలని ఆమె తన పిటీషన్ లో కోరింది.
Also Read: ప్రిన్సెస్ డయానాకు సైట్ కొట్టిన ట్రంప్.. ఛీకొట్టిన యువరాణి.. ఆ లవ్ స్టోరీ తెలుసా?
మరోవైపు సామ్ ఆల్ట్ మన్ మాత్రం తన సోదరి ఆరోపణలను పూర్తిగా అవాస్తవాలుగా కొట్టిపారేశారు. ఈ ఆరోపణలు తమ కుటుంబాన్ని తీవ్రంగా బాధపెడుతున్నాయని తెలిపారు. తన సోదరి ఆన్నీ మానసిక సమస్యలతో బాధపడుతోందని, ఇదంతా తన నుంచి డబ్బులు తీసుకోవడానికే చేస్తోందని చెప్పారు. ఆమెకు విభిన్న మార్గాల్లో ఇప్పటికే చాలా సార్లు ఆర్థికంగా సహాయం చేసినా, ఆమె తీరు మారలేదని తెలిపారు.
తన సోదరికి ప్రతినెలా డబ్బులు పంపిస్తూనే ఉన్నానని, ఆమె బిల్లులు కూడా తానే చెల్లిస్తున్నానని సామ్ చెప్పారు. ఆన్నీ ఇంటి అద్దె, ఆస్పత్రి ఖర్చులు అన్నీ తానే చూసుకుంటున్నానని తెలిపారు. ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలపై తన తల్లిదండ్రులు, సోదరుడెవరో బహిరంగంగా ఇష్టపడడం లేదని ఆయన అన్నారు. ఆన్నీ మానసికంగా బాధపడుతుంటే ఆమె వైద్య చికిత్స కోసం ప్రయత్నించినా.. ఆమె మాత్రం అందుకు సహకరించడం లేదని వెల్లడించారు.
అయితే సామ్ ఆల్ట్ మెన్ తాను టీనేజర్ ఉన్నప్పుడే తాను గే అని ప్రకటించారు. ఇప్పటికీ ఒక పరుషుడు ఆలివర్ ములిహెరిన్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సోదరి ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఈ కోర్టు కేసులో విచారణ ఏ దిశగా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాలో మిస్సోరి రాష్ట్ర చట్టాల ప్రకారం.. బాల్యంలో జరిగిన లైంగిక వేధింపులపై బాధితులు 31 సంవత్సరాల వయసు వరకు కోర్టులో కేసు వేయొచ్చు.