Unstoppable with NBK:ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan)..’ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రాబోతోంది. ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dilraju) దాదాపు రూ.300 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు దాదాపు రూ.90 కోట్లు ఖర్చు పెట్టినట్లు నిర్మాత తెలియజేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా జనవరి 10 అంటే రేపు ఈ సినిమా విడుదల కాబోతోంది.. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో (Unstoppable show)లో పాల్గొన్నారు. ఈ షోలో ప్రభాస్ అభిమానులు సంతోషపడేలా ఒక విషయాన్ని తెలియజేశారు.
బాలయ్య షోలో రామ్ చరణ్..
అసలు విషయంలోకి వెళ్తే.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్ 4, 9వ ఎపిసోడ్ ను నిన్న విడుదల చేశారు. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ బాగా వైరల్ అవుతోంది. ఇందులో రామ్ చరణ్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. అటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటు సినిమా లైఫ్ గురించి సంబంధించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. అంతేకాదు తన స్నేహితులైన ప్రభాస్ (Prabhas) తో ఫోన్ కాల్ మాట్లాడిన రామ్ చరణ్.. ఇదే షోలో తన ప్రాణ స్నేహితుడు శర్వానంద్ (Sharwanandh)తో కూడా సందడి చేశారు.
ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ కామెంట్స్..
ఇకపోతే ఈ షోలో భాగంగా రామ్ చరణ్ తన స్నేహితుడైన ప్రభాస్ కి ఫోన్ చేయాల్సిందిగా బాలయ్య కోరడంతో, చరణ్ ఫోన్ చేశారు. ఇక బాలకృష్ణ ఆరోజు అదేదో జరిగింది కదా.. అంటూ ప్రభాస్ తో చెప్పమని చెప్పగా.. ప్రభాస్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను చెప్పే విషయం నాకంటే చరణ్ కే ఎక్కువ భయం అవుతుంది. సార్ అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ పెళ్లెప్పుడు అని రామ్ చరణ్ ని అడగగా.. రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ప్రభాస్ పెళ్లి గురించి ఆరోజు చెప్పాడు సర్. కాకపోతే నాకు మతిమరుపు కదా నేను మరిచిపోయాను”..అంటూ చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు రామ్ చరణ్..అయినా ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు కదా అంటూ కూడా రామ్ చరణ్ కామెంట్లు చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు.. అన్నా నిజంగా మీకు చెప్పి ఉంటే గుర్తు చేసి మాకు ఇప్పటికైనా అసలు విషయాన్నీ చెప్పండి. మా అభిమాన హీరో పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి గురించి ఊరించి, చివర్లో మర్చిపోయాను అంటూ చెప్పి,అందరిని నిరాశపరిచారు రామ్ చరణ్. పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. కానీ నాలుగు పదుల వయసు దాటినా కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి అనే పదానికి దూరంగానే ఉన్నారు. మరి ఇప్పటికైనా పెళ్లి గురించి స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.