E-Paper
Advertisement

Nizamabad Road Accident: నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident:  నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి
Advertisement

Nizamabad Road Accident: నిజామాబాద్ స్వేచ్ఛ, బ్యూరో,  జాతీయ రహదారి 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలో ట్రావెల్స్​ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం గన్నారం శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా బస్సు గన్నారం శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇందులో చనీ పోయినా వారిలో తల్లి మంజూష, కొడుకు రిషి (7), మరో ప్రయాణికుడు అబ్బాస్ మరో ప్రయాణికుడు వివరాలు తెలియ రాలేదు. పలువురు తీవ్రంగా గాయపడడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందల్వాయి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Monalisa -Farman khan: మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కూడా నటుడా .. అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే?

రామచిలుకలను కాపాడిన అధికారులు

Advertisement

జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని శుక్రవారం రవాణా శాఖ కమిషనర్ దుర్గాప్రమీల, ఆర్టీవో ఉమామహేశ్వర్​రావులతో కూడిన బృందం పరిశీలించింది. బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ క్రమంలో బస్సులో అధికారులు రామచిలుక పెట్టెను గమనించి బయటకు తీశారు. ఈ నేపథ్యంలో బాక్స్​లో సుమారు 60 రామచిలుకలను కుక్కినట్లుగా ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ చిలుకలను స్థానిక పశువైద్యశాలకు తరలించారు. తనిఖీల్లో ఎంపీఐ కిరణ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ సినిమాకు అవమానం… ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ చూస్తే షాకే! ఆ అట్టర్ ప్లాప్ కంటే ఘోరం!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×