Birthday Bumps: ఈ రోజుల్లో యువత బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పుట్టిన రోజు వచ్చిందంటే చాలు కేక్ కట్ చేయడం.. ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం మామూలే అయితే.. ఈ మధ్యకాలంలో బర్త్ డే బంప్స్ పేరుతో చుట్టూరా ఫ్రెండ్స్ చేరి ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు. వీపులో పిడుగుద్దులు గుద్దుతున్నారు. గతంలో ఇలా బర్త్ డే బంప్స్ పేరుతో ఓ యువకుడిని ఫ్రెండ్స్ కొట్టడంతో.. ప్రాణాలే వదిలిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి… బర్త్ డే బంప్స్ పేరుతో సరదాగా కొడుతున్నాం అనుకుంటున్నారే.. తప్ప బాధిత యువకుడి పరిస్థితి ఏంటని యువత ఆలోచించండం లేదు. పోలీసులు హెచ్చరికలు జారినా కొంత మంది తీరు మాత్రం మారడం లేదు..
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ర్యాగింగ్ కలకలం..
9th క్లాస్ విద్యార్థి రిషాంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకుల్లో ర్యాగింగ్ చేసిన తోటి విద్యార్థులు
తోటి విద్యార్థులు తమ బాబు ప్రైవేటు పార్ట్స్ పై తన్నారని తల్లిదండ్రుల ఆరోపణ
తమ బాబుకు బ్లీడింగ్ వచ్చినా యాజమాన్యం పట్టించుకోలేదని… pic.twitter.com/JRUCYCESAK
— BIG TV Breaking News (@bigtvtelugu) September 17, 2025
తాజాగా హైదరాబాద్ లో తొమ్మిదో తరగతి బాలుడిని బర్త్ డే పేరుతో శరీరంపై, ప్రైవేట్ పార్ట్ లపై చావు దెబ్బులు కొట్టడంతో ఆ మైనర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. బాలుడికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ALSO READ: IBPS RRB: డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే బంగారు భవిష్యత్తు, ఇంకా 4 రోజులే
హైదరాబాద్, నాచారం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గడిచిన నెలలో ఈ ఘటన చోటుచేసుకోగా..ధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు నెలలో రిశాంత్ బర్త్ డే. బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే అతడి ఫ్రెండ్స్ బర్త్ డే బంప్స్ పేరుతో రిశాంత్ ఫ్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా కొట్టారు. తన స్నేహితుల్లో చరణ్, ఇంకా కొంత మంది ఉన్నట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ: Digital Arrest Fraud: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ మోసం.. భయంతో మహిళా డాక్టర్ మృతి..
దెబ్బలు గట్టిగా తాకడంతో రిశాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాబుకు బ్లీడింగ్ వచ్చినా యాజమాన్యం పట్టించుకోలేదని తమ గోడును వినిపంచారు. ఎలాగో అలా రిశాంత్ కు పేరెంట్స్ సర్జరీ చేయించారు. అనంతరం మూడు నెలల బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పిన వైద్యులు సూచించారు. అయితే రెండు రోజుల క్రితం నాచారం పోలీస్ లకు రిశాంత్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.