BigTV English

Shops: ఇక 24/7 షాపులు ఓపెన్.. వ్యాపారులకు పండగే.. ప్రభుత్వం పైసా వసూల్..

Shops: ఇక 24/7 షాపులు ఓపెన్.. వ్యాపారులకు పండగే.. ప్రభుత్వం పైసా వసూల్..
night bazar

Shops: రాత్రి 10 అయిందంటే చాలు దాదాపు అన్నిషాపులు బంద్ అవుతాయి. వైన్స్ మాత్రం 11 వరకు ఓపెన్ ఉంటాయి. అదికూడా ఫుల్ రష్‌తో. ఇక మిడ్‌నైట్ 12 వరకు బార్లు బార్లా తెరిచి ఉంచి రారమ్మని పిలుస్తుంటాయి. అక్కడక్కడా కొన్ని మెడికల్ షాపులు కొద్దిగా ఓపెన్ చేసి కనిపిస్తుంటాయి. ఇదీ రాత్రి వేళ బయటకు వెళ్తే కనిపించే సీన్లు. ఆ సమయంలో ఏదైనా అర్జెంట్ అవసరం ఏర్పడినా.. పిల్లలు ఏడుస్తుంటే ఏ పాల ప్యాకెటో, బ్రెడ్ ప్యాకెటో కావాలన్నా దొరకనే దొరకదు. ఫుడ్డే దొరకనప్పుడు ఇక వేరే సరుకుల గురించి చెప్పేదేముంది. కానీ, ఇకపై ఇలా ఉండదు. మొత్తం సీన్ మారిపోనుంది. తెలంగాణలో ఎనీ టైమ్.. ఎనీ షాప్ ఓపెన్ చేసుకోవచ్చని సర్కారు పర్మిషన్ ఇచ్చేసింది. కాకపోతే కండిషన్స్ అప్లై.


తెలంగాణలో దుకాణాలు, సంస్థలు ఇకపై 24 గంటలూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం -1988 కింద నమోదైన సంస్థలన్నిటికీ ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇందులోనూ లాభాన్ని చూసుకుంది సర్కారు. అలా 24 గంటలూ షాపులు, ఆఫీసులు తెరిచి ఉంచాలనుకుంటే.. ప్రభుత్వానికి ఏడాదికి రూ.10వేలు రుసుము చెల్లించాలని నిబంధన పెట్టింది. అంతా బాగుంది కానీ.. అన్ని షాపులు అంటే వైన్స్, బార్లు కూడా రాత్రంతా తెరిచే ఉంటాయా?

మిడ్‌నైట్ కూడా దుకాణాలు, ఆఫీసులు ఓపెన్ అంటే మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? రోజంతా పని చేయించుకునే ఓనర్లు కూడా ఉంటారుగా. అందుకే, అలాంటి శ్రమ దోపిడీకి ఛాన్స్ లేకుండా పలు కండిషన్స్ విధించింది కార్మికశాఖ. అవేంటంటే…
–కార్మికశాఖ విధించిన పనిగంటలు తప్పనిసరిగా పాటించాలి.
–ఎక్స్‌ట్రా టైమ్ పనిచేస్తే.. సిబ్బందికి ఓవర్‌టైం వేతనాలు ఇవ్వాలి.
–ప్రభుత్వం గుర్తించిన సెలవులు, పండగ వేళల్లో పనిచేస్తే వేతనంతో కూడిన ప్రత్యామ్నాయ సెలవు కల్పించాలి.
–మహిళా ఉద్యోగులకు భద్రతా చర్యలతో పాటు రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలి.
–పోలీసు నిబంధనల మేరకు వ్యవహరించాలి.
–ఉద్యోగులందరికీ ఐడీ కార్డులు ఉండాలి.
–వారాంతపు సెలవులు ఇవ్వాలి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×