E-Paper
Advertisement

Gajwel Congress Meeting : బకాసురుడు.. కుంభకర్ణుడు.. కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు..

Gajwel Congress Meeting : బకాసురుడు.. కుంభకర్ణుడు.. కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు..
Advertisement

Gajwel Congress Meeting : తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో కాంగ్రెస్ విజయభేరి సభ దద్దరిల్లింది. ఈ సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ రాజకీయ చరిత్రపై సెటైర్లు వేశారు. సిద్దిపేట , కరీంనగర్, మహబూబ్ నగర్ ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చివరికి గజ్వేల్ కు పారిపోయి వచ్చి ఇక్కడ ప్రజలను కూడా నమ్మించి నట్టేట ముంచారని మండిపడ్డారు.

గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మల్లన్న సాగర్ లో ముంచారని రేవంత్ విమర్శించారు. కొండపోచమ్మ సాగర్ , రంగనాయక సాగర్ బాధితులకు న్యాయం చేయలేదన్నారు. కేసీఆర్ ను గజ్వేల్ యువకులే ఓడిస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి కూడా కేసీఆర్ ఓడించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిందన్నారు.

Advertisement

గజ్వేల్ ప్రాంత రైతులు భూమలను కేసీఆర్ గుంజుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఆయన ఫామ్ హౌస్ చుట్టూ కాలువలు నిర్మించుకున్నారని తెలిపారు. ఆ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్లేందుకే ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. కానీ సామాన్య రైతులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. అందుకే ఈ ప్రాంత ప్రజలు కేసీఆర్ ను ఓడించాలని పిలునిచ్చారు. కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.

కేసీఆర్ లక్ష కోట్ల దోచుకున్నారని రేవంత్ ఆరోపించారు. 10 వేల ఎకరాలు లాక్కురని మండిపడ్డారు. బకాసురుడు , కుంభకర్ణుడు కేసీఆర్ అని సెటైర్లు వేశారు. కేసీఆర్ దోచుకున్న డబ్బు కక్కిస్తామన్నారు. గజ్వేల్ లో ఈసారి కేసీఆర్ పతనం ఖాయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గ ఓటర్లు ఓడిస్తారని తెలిసే.. కేసీఆర్ ఇప్పుడు కామారెడ్డికి పారిపోయారని సెటైర్లు వేశారు. కానీ అసలైన వేటగాడు కామారెడ్డిలో ఉన్నాడని రేవంత్ అన్నారు. ఆ నియోజకవర్గంలో కేసీఆర్ ను రైతులు ఓడిస్తారని తేల్చిచెప్పారు.

Advertisement

లంబాడీ తాండాలకు ఇందిరమ్మే న్యాయం చేశారన్నారు. లంబాడీలకు ఇళ్లు, భూములు ఇచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. అందుకే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం కొడంగల్ కు కేసీఆర్ వెళ్లి విమర్శలు చేశారన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుకు కేసీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×