E-Paper
Advertisement

KCR : కేసీఆర్ సారూ లాగే.. బీఆర్ఎస్ లో ఆ నేతలకు నాలుగేసి కళ్లు..!

KCR : కేసీఆర్ సారూ లాగే..  బీఆర్ఎస్ లో ఆ నేతలకు నాలుగేసి కళ్లు..!
Advertisement
KCR

KCR : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతాలని చూపించి అవి రెండూ.. నా కళ్లు అంటూ ఉంటారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బాల్కొండ సభలో మాట్లాడుతూ కామారెడ్డి, బాల్కొండ నాకు రెండు కళ్లు లాంటివని అన్నారు. మీకోసమే మీకు దగ్గరలోని కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని వారికి చెప్పారు. అయితే మొదటి నుంచి కేసీఆర్ ఊతపదాల్లో ఈ రెండు కళ్ల సిద్ధాంతం కూడా ఒకటి. అందుకే ఈ మాట తెలంగాణలో బాగా పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ఆలేరులో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ అక్కడ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అప్పుడు ఏమనేవారంటే నాకు గజ్వేల్ ఎంతో, ఆలేరు అంతే, ఇవి రెండు నాకు రెండు కళ్లు లాంటివని అనేవారు.

అలా ఆ మాట ఆ పార్టీ వాళ్లు బాగానే వంట పట్టించుకున్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా ఈ రెండు కళ్ల సిద్ధాంతంలో పడ్డారు. సిరిసిల్లా, వేములవాడ నాకు రెండు కళ్లు లాంటివని అంటారు. పోచంపల్లి వెళతారు. అక్కడా ఇదే పాట. నా నియోజకవర్గం సిరిసిల్లలో కూడా అంతా నేతన్నలే ఉన్నారు. ఇక్కడా మీరే ఉన్నారు. అందుకే నాకు అదొ కన్ను, ఇదో కన్ను అంటారు.

Advertisement

వీరి మధ్యలోకి హరీష్ రావు కూడా వచ్చారు. నేనేమైనా తక్కువ తిన్నానా? అంటారు. ఆయన కూడా ఈ రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదల్లేదు. ఎక్కడికెళ్లినా తన నియోజకవర్గం సిద్ధిపేట, పక్కనే ఉన్న దుబ్బాకను చూపించి, ఇవి రెండు నా రెండు కళ్లు అంటారు. మళ్లీ మరొక చోటుకెళ్లి సిద్ధిపేట, హుస్నాబాద్ నా రెండు కళ్లు అంటారు.

ఈ లెక్కన చూస్తే ఒకొక్కరికి ఎన్నేసి కళ్లున్నాయో ఎవరికీ తెలీడం లేదు. కేసీఆర్ ఏ పాట పాడితే, అది వీళ్లు పాడటమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కువ కళ్లు ఉండటం వల్ల ఫోకస్ ఎక్కువై మా నియోజకవర్గాలు మీకు కనిపించడం లేనట్టుంది. అందుకే అభివృద్ధిని మరిచిపోయారని ప్రజలు అంటున్నారు.  మీ కళ్లకి గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట తప్ప ఏవీ కనిపించడం లేదనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే  కళ్లు ఎక్కువైనా ప్రమాదమే, దృష్టి దోషం వస్తుంది. కొద్దిగా ఆ సూపు తగ్గించమని కోరుతున్నారు.

Advertisement

ఇవన్నీ ఎప్పటి నుంచో గమనిస్తున్నట్టున్నారు మంత్రి మల్లారెడ్డి. తను ఏకంగా నాలుగు అడుగులు ముందుకేశారు. నాకూ రెండు కళ్లున్నాయి. అన్నాడు. అందులో ఒకటి కేసీఆర్ అయితే, మరొకటి కేటీఆర్ అన్నారు. చూశారా… ఇవన్నీ చూసిన చాలామంది అంటున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కూడా రెండు కళ్లున్నాయి ఒకటి రియల్ ఎస్టేట్, రెండు సినిమా ఫైనాన్స్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఇలా అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి కూడా జీవన్ రెడ్డిలాగే రెండేసి కళ్లు, నాలుగేసి కళ్లు లాంటి వ్యాపారాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు ఇసుక దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఇలా చాలా కళ్లతో ఎమ్మెల్యేలు తిరుగుతున్నారనే విమర్శలైతే నెట్టింట తీవ్రంగా వినిపిస్తున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×