BigTV English

BRS: ప్లీనరీ పోయి మీటింగ్ వచ్చే.. బీఆర్ఎస్ ఆవిర్భావ వ్యూహమేంటి?

BRS: ప్లీనరీ పోయి మీటింగ్ వచ్చే.. బీఆర్ఎస్ ఆవిర్భావ వ్యూహమేంటి?
kcr brs

BRS: 23 వసంతంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ. ప్రతిసారి గ్రాండ్‌గా ఉండే ఆవిర్భావ వేడుకలు ఈసారి సాదాసీదాగా జరుగుతున్నాయ్‌. తెలంగాణ భవన్‌లో జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించనున్నారు. మరి సమావేశం ఎజెండా ఏంటీ? ఏం తీర్మానాలు చేయనున్నారు? పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రసంగం ఎలా ఉండబోతుంది?


ముచ్చటగా మూడవసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా కేసీఆర్ రూటు మార్చారు. ఎన్నికల సమయం కావడంతో ఆత్మీయ సమ్మేళనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS ప్లీనరీని గతంలో ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ ప్లీనరీకి హాజరయ్యేవారు. ఈ సారి సైతం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో పార్టీ ప్లీనరీని ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత ప్లీనరీని రద్దు చేసి జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా మినీ ప్లీనరీలకు పిలుపునిచ్చారు.

గురువారం జరిగే జనరల్ బాడీ సమావేశంలో రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. మోడీ వైఫల్యం, అదాని కంపెనీల షేర్ల విషయం, విభజన హామీలపై కేంద్రం నిర్లక్ష్యం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో పాటుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఆస్తుల అమ్మకం, సామాజిక భద్రత లాంటి అంశాలపై రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయ్‌. తెలంగాణలో BRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి అంశాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.


ఇక TRS… BRSగా మారిన తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అనుసరించాల్సిన వ్యూహంపై జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అయితే, పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ ఇస్తారా? ఏయే సిట్టింగులను ఈసారి టికెట్లు గల్లంతు అనే దానిపై స్పష్టత ఇస్తారా?

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×