Hyderabad News: పచ్చని సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఫలితంగా గుట్టుగా సాగుతున్న కాపురాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు లేని వాళ్లు కాదు ఈ విధంగా వ్యవహరించేవారు. ఇప్పుడు కొందరు అధికారులు ఆ విధంగా వ్యవహరిస్తుండడంతో సామాన్యులు అవాక్కు అవుతున్నారు. అసలేం జరిగిందంటే..
జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నాడు జానకీరామ్. హోదా కూడా పెద్దదే. పైసలకు కొదవలేదు. ఏదో సమస్య ఆయన్ని తరచూ వెంటాడుతూ ఉండేది. ఆ బలహీనత నుంచి బయటపడాలని భావించాడు. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మూడో కంటికి తెలీకుండా జాగ్రత్తగా మెయిన్ టైన్ చేస్తూ వచ్చాడు.
తన భర్త వ్యవహారశైలిలో వచ్చిన మార్పులను గమనించింది భార్య కల్యాణి. సమ్‌థింగ్ ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది. భర్త జానకిరామ్ సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లో అపార్టుమెంటులో ఓ అమ్మాయితో ఉంటున్నట్లు తేలింది. ఇద్దరు కలసి ఉండగా భార్య కళ్యాణి పట్టుకొని చితకబాదింది. కల్యాణి బంధువులు సైతం జానకీరామ్ ని చావబాదారు.
ఫ్యామిలీ గొడవ జరుగుతున్న సమయంలో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు తన భర్త జానకీరామ్, మరో మహిళను అప్పగించింది కల్యాణి. వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
ALSO READ: తాజ్ బంజారా హోటల్‌కు జీహెచ్ఎంసీ షాక్
కొత్త విషయాలు
జానకీరామ్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఖమ్మం, మెదక్ లో పని చేశాడాయన. చిన్న వయస్సుగల వారితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు భార్య కల్యాణి ప్రధాన ఆరోపణ. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. అమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయేవాడని చెప్పారు. భర్తను ఎలాగైనా మార్చుకోవాలనే ఆలోచనతో కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.