Honey Rose:హనీ రోజ్ (Honey Rose).. తెలుగులో గతంలోనే ‘ఈ వర్షం సాక్షిగా’ తోపాటు పలు చిత్రాలలో నటించిన మలయాళీ ముద్దుగుమ్మ.. ఇక అప్పట్లో తెలుగు సినిమాలలో నటించినా.. పెద్దగా గుర్తింపు రాకపోవడంతో.. మలయాళం ఇండస్ట్రీలోనే పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఎప్పుడైతే నటసింహా నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో నటించిందో ఇక దాంతో అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. బాలయ్య హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంది. మీనాక్షి పాత్రలో తన నటనతో అందరిని అబ్బురపరిచింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈమె పేరు ఎక్కడ చూసినా మారుమ్రోగింది. అవకాశాలు కూడా భారీగా తలుపు తడతాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏ సినిమాలో కూడా ఈమెకు అవకాశం లభించలేదు.
20 సంవత్సరాలుగా ఆ కోరిక తీరలేదు..
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అటు మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా ఈమె నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో అని అభిమానులు కూడా ఎదురు చూస్తుండగా.. చాలా కాలం తర్వాత ఒక సినిమాను అనౌన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. హనీ రోజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా రాబోతోంది.’రాచెల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అంతేకాదు ఆ వార్త ఆమె స్వయంగా చెప్పడం గమనార్హం. 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని అయినా సరే తనకు ఆశించిన స్థాయిలో పాత్రలు రాలేదు అని తెలిపింది హనీ రోజ్.
మనసుకు హత్తుకునే పాత్రే లభించలేదు..
ఈ క్రమంలోనే హనీ రోజ్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది. అయితే నా హృదయానికి దగ్గరగా ఉండే ఒక్క పాత్ర కూడా ఇంకా నన్ను వరించలేదు. నా మొదటి సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో మలయాళ సినిమాల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నేను నటించిన చిత్రాల కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొనడం ద్వారానే ఎక్కువ ప్రసిద్ధి చెందాను. కనీసం ఇకనైనా నా క్రేజ్ ను పెంచే చిత్రాలు వస్తాయని ఆశిస్తున్నాను” అంటూ హనీ రోజ్ తెలిపింది. ఇక ప్రస్తుతం హనీ రోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇన్నేళ్లయినా కనీసం ఒక పాత్ర కూడా మీ మనసుకు హత్తుకోలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
హనీ రోజ్ కెరియర్..
2005లో మలయాళంలో విడుదలైన ‘బాయ్ ఫ్రెండ్’ అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, మలయాళం తోపాటు కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించి ఆకట్టుకుంది. ఇక తొలిసారి తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించిన ఈమె.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బాలయ్య 107వ చిత్రం ‘వీర సింహారెడ్డి’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఇప్పుడు నిత్యం యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో వరుస ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Anjana Devi: చిరంజీవి తల్లికి అస్వస్థత.. అసలేమైందంటే..?