E-Paper
Advertisement

Global Summit Day 2 Highlights: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. వాణిజ్యవేత్తలతో సర్కారు కీలక ఒప్పందాలు

Global Summit Day 2 Highlights: తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల.. వాణిజ్యవేత్తలతో సర్కారు కీలక ఒప్పందాలు

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సమ్మీట్ వేడుకలా సాగుతోంది. రెండోరోజు (మంగళవారం) సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాలిఫోర్నియా ఎకనమిక్ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ GOI, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినీ నటుడు చిరంజీవి, మంత్రులు, దేశ, విదేశాల ప్రముఖులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

సమ్మీట్ 2వ రోజు విశేషాలు

సమ్మీట్‌లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు, సినీ ప్రముఖులు విచ్చేశారు. వాణిజ్య వేత్తలు సైతం పాల్గొని ప్రభుత్వంతో పలు పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరోవైపు సమ్మిట్‌లో ప్యానల్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ముగింపు వేడుకలో భాగంగా రాత్రి గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. డ్రోన్ల ప్రదర్శన నిర్వహించనున్నారు.

35 కంపెనీలతో ఒప్పందాలు

సమ్మిట్ ప్రారంభమైన తొలిరోజే 2లక్షల 43వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ సమ్మిట్‌లో 35 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. మంగళవారం కూడా పలు సంస్థలు పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకొనేందుకు ముందుకొచ్చాయి. సీఎం ఈ ఒక్కరోజే సుమారు 20 సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు AI రంగాల కంపెనీలతో చర్చిస్తున్నారు.

వర్చువల్‌గా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలు వర్చువల్‌గా ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సాయంత్రం ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ ప్రైజెస్ రంగాల పెట్టుబడులపై చర్చిస్తారు. ఇవాళ చివరిరోజు రాత్రి తెలంగాణ రైజింగ్ కమ్-జాయిన్‌ది రైస్ థీమ్‌తో ముగింపు వేడుక నిర్వహించనున్నారు.

క్రీడాకారులు ముందుకు రావాలి: అంబటి రాయుడు

గ్లోబల్ సమ్మిట్‌లో క్రీడారంగంపై జరిగిన ప్యానల్ డిస్కషన్‌లో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు. ప్యానల్ డిస్కషన్‌లో తన సందేశాన్ని ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారాయన. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతోందని ధీమా వ్యక్తం చేశారు. క్రీడారంగానికి పెద్దపీట వేసిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారంటున్న క్రికెటర్ అంబటి రాయుడితో

తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం అభినందనీయం: గుత్తా జ్వాల

ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకుంటున్నాను -గుత్తా జ్వాలగ్లోబల్ సమ్మిట్ లో సెకండ్ డే ప్యానల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒలంపిక్ గోల్డ్ క్విస్ట్ అనే అంశంపై జరిగిన డిస్కషన్ లో బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల పాల్గొన్నారు. తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం సంతోషం అన్నారు. మనం విదేశీ కోచ్ లపై ఆధారపడవద్దన్నారు గుత్తా జ్వాల. మంచి కోచ్‌లు దేశంలోనూ ఉన్నారంటున్న గుత్తా జ్వాలాతో

సీఎం రేవంత్ రెడ్డితో తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్ భేటీ

సీఎంతో భేటీ అయిన టీసీసీఐ, సెంబ్ కార్ప్ ప్రతినిధులుసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్. సుమధుర గ్రూప్ ప్రతినిధులు కూడా సీఎంను కలిసారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓ స్వరూప్ అనివేశ్, అనలాగ్ AI ఓటూడ్లోజ్ ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు. వారితో పాటు డ్రీమ్ వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ ప్రతినిధులు, టీసీసీఐ ప్రతినిధులు, సెంబ్ కార్ప్ ప్రతినిధులు సీఎంను కలిసారు.

ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చిన కొండా సురేఖ

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సంబురం కొనసాగుతోంది. భారత్ ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు మంత్రి కొండా సురేఖ. ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చారు మంత్రి. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన చీరతో సమ్మిట్‌కు హాజరయ్యారు కొండా సురేఖ. అటవీ-పర్యావరణం, దేవాదాయశాఖపై సమ్మిట్ వేదికగా మంత్రి కొండా సురేఖ బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రధానంగా అటవీ-పర్యావరణం, దేవాదాయశాఖలో ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. ఇక రానున్న రోజుల్లో తన శాఖలకు సంబంధించిన అభివృద్ధి అంశాల ఎజెండాను వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. అదేవిధంగా ప్యానల్ డిస్కషన్స్‌లోనూ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.

మరో గ్లోబల్ సమ్మిట్‌కి వేదిక కానున్న హైదరాబాద్‌

స్టార్టప్‌లకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ ఉంటుందన్న ఆప్టా ప్రతినిధులు. హైదరాబాద్‌ మరో గ్లోబల్ సమ్మిట్‌కి వేదిక కానుంది. జనవరి 4, 5, 6 తేదీల్లో గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఆప్టా ప్రతినిధులు. మొదటిరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రెండో రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చివరి రోజు చిరంజీవి హాజరు కానున్నారు. తెలుగు కమ్యూనిటీకి చెందిన బిజినెస్‌మెన్‌లకు ఈ కాన్ఫరెన్స్ చాలా తోడ్పాటు అందిస్తుందని ఆప్టా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Also Read: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు భారీగా పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలంటే?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×