EPAPER

Golden Saree: కూతురి పెళ్లికి బంగారు చీర.. సిరిసిల్ల చేనేత అద్భుతం

Golden Saree: కూతురి పెళ్లికి బంగారు చీర.. సిరిసిల్ల చేనేత అద్భుతం

Gold Saree For Daughter Wedding: సిరిసిల్ల అంటేనే చేనేత రంగానికి పెట్టింది పేరు. చేనేత కార్మికులు తమ వృత్తిలో భాగంగా ఎన్నో అద్భుతాలను సృష్టించారు. అగ్గిపెట్టెలో చీరను నేచి అందరినీ అబ్బుపరపరిచారు. అయితే, ఇదే ప్రాంతానికి చెందిన మరో చేనేతే కార్మికుడు ఏకంగా బంగారు చీరను నేచాడు. దీంతో మగ్గంపై ఈ బంగారు చీరను నేచి.. చేనేత గొప్పతనాన్ని మరోసారి చూపించాడు. ఈ విషయాన్నే తానే స్వయంగా తెలిపాడు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి ఈ బంగారు చీరను తనతో నేయించాడని చెప్పుకొచ్చాడు. ఆ చీరను తన కూతురి పెళ్లికి కానుకగా ఇవ్వనున్నానని ఆ వ్యాపారి చెప్పాడని ఆ నేతన్న తెలిపాడు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అతని ప్రతిభను అభినందిస్తూ కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Also Read: ఈయన సామాన్యుడు కాదు.. ఏకంగా ప్రధాని మెప్పు పొందాడుగా..

అక్టోబరు 17న ఆ వ్యాపారి కూతురు పెళ్లి. వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, తన కూతురుకు ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఆ వ్యాపారి. ఇందుకోసం అందరి కంటే భిన్నంగా ఆలోచించాడు. బంగారు నగలు పెట్టడం కాదు.. తన కూతురికి ఏకంగా బంగారు చీరను గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే నేతన్నను కలిశాడు. తన కూతురు కోసం బంగారు చీర చేయాలని చెప్పాడు. ఆ పెళ్లిలో తన కూతురు బంగారు చీర కట్టుటకుంటుందని, త్వరగా నేచి ఇవ్వాలని కోరాడు. ఇందు కోసం ఎన్ని రూ. లక్షలైనా ఖర్చుపెడుతానన్నాడు. దీంతో విజయ్ కుమార్ ఒప్పుకున్నాడు. వ్యాపారి అనుకున్న విధంగా ఆ బంగారు చీరను నేచాడు. ఎంతో శ్రమించి, జాగ్రత్తగా ఆ చీరను నేచినట్లు చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ చీరను ఆ వ్యాపారికి అందించనున్నట్లు పేర్కొన్నాడు విజయ్ కుమార్.


‘అత్యంత ఖరీదైన బంగారు చీరను నేను నేచాను. హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి తన కూతురి పెళ్లి కోసం చేయించాడు. చాలా రోజులు కష్టపడి నేచాను. ఇందుకోసం నాకు చాలామంది సహకరించారు. ఈ చీర పొడవులో ఐదున్నర మీటర్లు ఉంటుంది. వెడల్పులో 49 ఇంచులు ఉంటుంది. బరువు వచ్చేసి 800 నుంచి 900 గ్రాముల వరకు ఉంటుంది. మొత్తం రూ. 15.6 లక్షలకు పైగా విలువ చేసే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారాన్ని చీర తయారీలో ఉపయోగించాం. బంగారు చీరను పూర్తిగా తయారు చేసేసరికి వచ్చిన ఖర్చు రూ. 18 లక్షలు. ఆ వ్యాపారి కూతురు పెళ్లి అక్టోబర్ 17న జరగనున్నది. ఆ రోజున పెళ్లి కూతురు ఈ బంగారు చీరను కట్టుకోనున్నది.

Also Read: దసరాకు 6 వేల స్పెషల్ బస్సులు.. ముందస్తు రిజర్వేషన్ కోసం సైట్ ఓపెన్..

ఇది చాలా ప్రత్యేకమైనది. బంగారు చీరను నేచే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అప్పజెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేశాను. ఇది నా ఎన్నో ఏళ్ల కల. బంగారు చీరతో ఆ కల పూర్తయ్యింది. ఇది నాకు మాత్రమే కాదు.. మా చేనేత రంగానికే ఎంతో గౌరవం’ అని తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు నేతన్న విజయ్ కుమార్. ఈ విషయం తెలిసి అంతా ఆ నేతన్నను ప్రశంసిస్తున్నారు. మీ ప్రతిభ సూపర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Related News

Malla Reddy – CM Revanth: సీఎం రేవంత్‌ని కలిసిన మల్లారెడ్డి.. రాజకీయాలపై చర్చ

TG DSC 2024: తెలంగాణలో కొత్త టీచర్లకు నియామక పత్రాలు, సీఎం రేవంత్ న్యూరికార్డ్

Revanth On Musi River: విపత్తులు అరికట్టాలంటే తప్పదు.. అందరికీ న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్

Saddula Bathukamma 2024: కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ…ప్రాముఖ్యత ఇదే !

Hyderabad Metro Rail: మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు.. 5 కారిడార్లకు రూ.24,269 కోట్ల వ్యయం

Harishrao: పండుగ సమయంలోనూ జీతాలివ్వరా..? ఇదేనా ప్రజా పాలన..? : హరీష్ రావు

SC Sub-Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..

×