BigTV English

New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ దారులకు శుభవార్త.. అనుమానం వద్దు, వెంటనే చెక్ చేయండి?

New Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ దారులకు శుభవార్త..  అనుమానం వద్దు, వెంటనే చెక్ చేయండి?

New Ration Card Updates:  తెలంగాణ కొత్తరేషన్ దారులకు కమ్మని కబురు చెప్పింది రేవంత్ సర్కార్. కార్డు ఇచ్చిన ప్రభుత్వం మిగతా సదుపాయాలు ఎప్పటినుంచి ఇస్తుందనే అనుమానం అవసరం లేదు. వచ్చేనెల వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదెలా అనుకుంటున్నారా? వీటిపై ఇంకాస్త లోతుగా వెళ్తే..


కొత్త రేషన్ కార్డులు వచ్చినవారికి తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. సెప్టెంబర్ నెల నుంచి వారికి సన్న బియ్యం ఇవ్వడమేకాదు ఆరోగ్యశ్రీ పథకం వర్తించనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల సంఖ్య దాదాపు 90 లక్షలుగా ఉంది. వీటివల్ల 2 కోట్ల 81 లక్షల మంది లబ్దిదారులు పొందుతున్నారు.

పాత రేషన్ కార్డు దారులకు ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ అవుతాయి. కొత్త రేషన్ కార్డులు తీసుకున్నవారి పేర్లను ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు నమోదు కాలేదు. ఆరోగ్యశ్రీ సేవలు వారికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు వారు ఆ సేవలను అందుకోనున్నారు. ప్రస్తుతం 461 ప్రైవేట్-కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్న విషయం తెల్సిందే.


ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుదారులను ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఈ పని పూర్తవడానికి 10 రోజులు సమయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్తగా 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. సెప్టెంబర్ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పొందవచ్చ. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టింది ప్రభుత్వం.

ALSO READ: ముక్కు మూసుకునే చెరువు.. రూపం మార్చుకుని ఆహ్వానిస్తోంది?

జూన్ లో ఒకేసారి 3 నెలలకు సరిపడిన బియ్యం ఇచ్చారు. ఆ నెలలో చాలామంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. కొత్తగా చేరేవారి సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో లక్షల క్వింటాళ్ల సన్న బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి మళ్లీ సన్న బియ్యం పాత, కొత్త రేషన్ కార్డుదారులకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

సెప్టెంబర్‌లో తప్పనిసరిగా తీసుకునే అవకాశం రేషన్ కార్డు లబ్దిదారులకు రానుంది. అలాగే ఆరోగ్యశ్రీ అప్‌డేట్ అయ్యిందో లేదో సంబంధిత వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి. ఇదిలా ఉండగా పర్యావరణానికి మేలు చేసే తెల్ల బ్యాగులను లబ్దిదారులకు ఇవ్వనుంది. వాటిని బయట కొనుగోలు చేస్తే ఒక్కొక్కటీ 50 నుంచి 70 రూపాయల వరకు ఉంటుంది. ప్రభుత్వం వాటిని ఉచితంగా ఇవ్వనుంది.

లబ్దిదారులు వాటిని తీసుకుని ప్రతీ నెలా బియ్యాన్ని ఆ బ్యాగుల్లో తీసుకెళ్లవచ్చు. ఆల్రెడీ రేషన్ షాపుల్లో ఆయా బ్యాగులు ఉన్నాయి. రేషన్ కోసం వెళ్లి వాటిని తీసుకోవచ్చు. బ్యాగులు ఇవ్వరనే అనుమానం అవసరం లేదు. రేషన్ కార్డుల సంఖ్యకి తగినట్లుగా సంచులను రెడీ చేశారు అధికారులు. ప్రతి లబ్దిదారుకు ఆయా బ్యాగులను ఇవ్వనున్నారు. వాటిని ఇచ్చినప్పుడు లబ్దిదారుడి వేలి ముద్ర కచ్చితంగా తీసుకుంటారు.

Related News

Heavy Rains: రాష్ట్రంలో మళ్లీ కుండపోత వానలు.. రెండ్రోజులు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, భారీ పిడుగులు..?

Harish Rao: తెలంగాణ బీజేపీ ఎంపీలకు హరీష్ రావు సవాల్.. ఆ విషయంలో కేంద్రాన్ని అడిగే దమ్ముందా..?

Telangana Jagruthi: కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు

Hyderabad Real Estate: MSN రియాల్టీ సంస్థ సరికొత్త రికార్డ్.. ఎకరా స్థలం రూ.177 కోట్లకు కొనుగోలు

Telangana Pharma Hub: ఫార్మా ఇండస్ట్రీలో మరో మైలురాయి.. హైదరాబాద్ నుంచే ప్రపంచ స్థాయి ఔషదాల తయారీ

Election Code: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలు

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

BC Reservations: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..

Big Stories

×