E-Paper
Advertisement

Hyderabad To Ayodhya: రామ భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ టూ అయోధ్యకు ఫ్లైట్..

Hyderabad To Ayodhya: రామ భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ టూ అయోధ్యకు ఫ్లైట్..
Advertisement
Hyderabad To Ayodhya
Hyderabad To Ayodhya

Hyderabad To Ayodhya Flight(Today latest news telugu): 500 ఏళ్ల తర్వాత రామజన్మభూమిలో నిర్మించిన రామమందిరాన్ని, బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల నుంచి ఉచిత రైలు, బస్సు ప్రయాణాలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇటీవలె ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. తాజాగా మరోసారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక విమానం నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విమానాన సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో లేఖపై స్పందించిన జ్యోతిరాదిత్య విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ విమానం ఏప్రిల్ 2 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఇది వారానికి 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. అందులో మంగళవారం, గురువారం, శనివారాల్లో భక్తులకు విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది.

Advertisement

Also Read: తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..

కాగా, జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు కన్నుల పండుగలా జరిగాయి. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. తరువాత రోజు నుంచే సామాన్య ప్రజలకు అయోధ్య దర్శనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×