BigTV English

TDP State Chief: అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం.. చంద్రబాబు సంతాపం

TDP State Chief: అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం.. చంద్రబాబు సంతాపం
TDP State Chief atchannaidu news
TDP State Chief

Atchannaidu latest news(AP news today telugu): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని స్వగృహంలో జరిగినట్లు తెలిపారు. కళావతమ్మ(90) వయోభారంతో అనారోగ్యం బారిన పడి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అచ్చెన్నా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ క్రమంలో తల్లి మరణ వార్త విని వెంటనే స్వగ్రామానికి చేరుకున్నారు.


Also Read: నారా లోకేష్‌‌కు జెడ్ కేటగిరీ భద్రత.. కేంద్రం ఆదేశాలు జారీ

కళావతమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం తెలిపారు. వీరితో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే వెంటనే అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి ఓదార్చినట్లు తెలుస్తోంది.


అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ భర్త దాలినాయుడు. ఆయన 15 ఏళ్ల క్రితం కన్నుమూశారు. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెల సంతానం కలిగారు. పెద్ద కొడుకు ఎర్రన్నాయుడు 12 ఏళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే అచ్చెన్నా కుటుంబంలోని ప్రతీ ఒక్కరు రాజకీయాల్లోనే ఉన్నారు. దివంగత ఎర్రన్నాయుడు కూడా టీడీపీ హయాంలో పేరు పొందారు. రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉంది.

Related News

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

Big Stories

×