E-Paper
Advertisement

Avanigadda seat for Mandali: అవనిగడ్డ సీటు ఆయనదే, ఎందుకంటే..?

Avanigadda seat for Mandali: అవనిగడ్డ సీటు ఆయనదే, ఎందుకంటే..?
Advertisement

Mandali Buddha Prasad news

Avanigadda seat for Mandali(Latest news in Andhra Pradesh): ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఓ సీటును జనసేన దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా అవనిగడ్డ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి హైకమాండ్ దాదాపు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

తెలుగుదేశం-బీజేపీ కూటమిలో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు వెళ్లింది. ఆ పార్టీ నుంచి అక్కడ చాలామంది టికెట్ ఆశించారు. కాకపోతే క్లీన్ ఇమేజ్ పర్సన్ కోసం జనసేన ప్రయత్నాలు చేసింది. చివరకు మండలి బుద్ధప్రసాద్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. దానికితోడు ఆ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్‌కు మాంచి పేరుంది. జనసేన నిర్వహించిన సర్వేలో కూడా ఆయన వైపు  చాలామంది మొగ్గుచూపారు. ఈ క్రమంలో జనసేన నేతలు బుద్ధప్రసాద్‌ను సంప్రదించడం అందుకు ఆయన ఓకే చేసినట్టు వార్తలొస్తున్నాయి.

ALSO READ: అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆ ఫైల్ పైనే.. చంద్రబాబు కీలక హామీ

Advertisement

అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ మూడుసార్లు గెలుపొందారు. రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఒకసారి టీడీపీ తరపున ఆయన విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న సింహాద్రి ఫ్యామిలీ ఎదుర్కోవాలంటే బుద్ధప్రసాద్ కరెక్టయిన వ్యక్తని పవన్ భావించారు. ఆయనకు సీటు ఇస్తే విజయావకాశాలు ఉంటాయని జనసేన భావించింది. ముఖ్యంగా మచిలీపట్నం కూటమి అభ్యర్థి బాలశౌరి కూడా తన మద్దతు బుద్ధప్రసాద్‌కే ప్రకటించారట. ప్రస్తుతం పిఠాపురంలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను ఆయన సోమవారం కలవనున్నారు. పవన్‌కల్యాణ్ అధికారికంగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×