Big Stories

Graduate MLC Polling: మందుబాబులకు భారీ షాక్.. బంద్ కానున్న లిక్కర్ షాపులు

Wine shops, bars will shut down(Latest news in telangana): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లా పట్టభుద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను 48 గంటలపాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో మే 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయనున్నారు.

- Advertisement -

పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 27 వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని పేర్కొంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు కూడా తమ ఉద్యోగులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. ఇందుకుగాను షిఫ్టుల సర్దుబాటు గానీ, ఓటు వేసి ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులను ఆలస్యంగా వచ్చారంటూ భావించకుండా వారిని విధుల్లోకి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే, వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 4,61806 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు: మంత్రి జూపల్లి

కాగా, తెలంగాణలో ఈ నెల 13న జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం విధితమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News