BigTV English

Nandamuri Balakrishna: ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడం కాదు.. ఆ పని చేయాలి

Nandamuri Balakrishna: ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడం కాదు.. ఆ పని చేయాలి

Nandamuri Balakrishna: ఎన్.టి. రామారావు గారి వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. ఆయన సినిమాలు గురించి చెప్పుకోవడం కాదు.. ఆయన దారిలో మనము అనుసరిస్తున్నామా.. లేదా.. అనేది ముఖ్యమని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం సత్యభామ. డైరెక్టర్ శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా సినిమాను సమర్పిస్తున్నాడు. జూన్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక ఈ నేపథ్యంలోనే నేడు సత్యభామ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎలక్షన్స్ కాంపెయిన్ పూర్తి చేసుకొని వచ్చాం. రాగానే షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా. కానీ ఇంత వరకూ స్టార్ట్ చేయలేదు.. లాస్ట్ 40-50 రోజుల్లో ఏమైనా మిస్ అయ్యాను అంటే.. అది కెమెరానే అని చెప్పుకొచ్చాడు.

ఇక సత్యభామ టైటిల్ గురించి పురాణాల్లో శ్రీకృష్ణుడు, సత్యభామను గుర్తుచేసుకొని కొన్ని పవర్ ఫుల్ టైటిల్స్ లో సత్యభామ ఒకటి అని తెలిపాడు. ఇక కాజల్ గురించి మాట్లాడుతూ.. ఈ కాలంలో హీరోయిన్స్ కు ఒక ముద్ర పడిపోతుంది. పెళ్లి అయ్యి పిల్లలు పుడితే.. రీఎంట్రీలో అమ్మ, అక్క పాత్రలు వస్తాయని ముద్ర ఉంది. కాజల్ ఆ ముద్రను బ్రేక్ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక బాలకృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ లెగసీ గురించి మాట్లాడాడు.


“తెలుగు ఇండస్ట్రీ రామారావు గారితో మొదలయ్యింది. ఆ డిసిప్లిన్, ఆ డెడికేషన్, ఆర్టిసులకు మర్యాద ఇవ్వడం, ఇలా ఆయన చేసినవి మేము కొనసాగిస్తున్నాం. ఎన్.టి. రామారావు గారి వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. ఆయన సినిమాలు గురించి చెప్పుకోవడం కాదు.. ఆయన దారిలో మనము అనుసరిస్తున్నామా.. లేదా.. అనేది ముఖ్యం. ఎన్టీఆర్ వారసులుగా అందరం ఆయనను అనుసరిద్దాం. ఈరోజు భారత చలన చిత్ర రంగంలో మనం మొదటిస్థానంలో ఉన్నాం. అది ఎంతో సంతోషకరం. ఈ సినిమా కాజల్ కు మంచి విజయం అందించాలని కోరుకుంటున్నట్లు” తెలిపాడు. ప్రస్తుతం బాలకృష్ణ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×