Revanth Reddy : హైదరాబాద్ లోని సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ గా ఎంట్రో ఇచ్చారు. ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లారు. అక్కడ రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తన సీటులో రేవంత్ ఆశీనులయ్యారు. పండితులు వేదఆశీర్వచనాలు అందించారు.
సచివాలయంలో పూజల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత కేబినెట్ భేటీ మొదలైంది. మరోవైపు ప్రగతి భవన్ ను ప్రజా భవన్ మార్చే పనులు సాగుతున్నాయి. అక్కడ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. శుక్రవారం ఉదయం 10 గటంలకు ప్రజాదర్బార్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.