E-Paper
Advertisement

హనుమకొండలో తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొన్న కారు!

హనుమకొండలో తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొన్న కారు!
Advertisement

Hanumakonda School Bus Accident: హనుమకొండ జిల్లాలో సోమవారం సాయంత్రం ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. దామెర మండలం ఒగ్లాపూర్ సమీపంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సును ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే బస్సు డ్రైవర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో స్కూల్ బస్సులో ఉన్న 38 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని ఏకశిలా స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని ఊరుగొండ గ్రామానికి వెళ్తోంది. ఒగ్లాపూర్ శివారుకు చేరుకోగానే, ఎదురుగా వస్తున్న ఒక కారు అదుపు తప్పి నేరుగా స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు అతివేగంగా ఉందని, కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని చిన్నారులు భయాందోళనతో కేకలు వేశారు. అదృష్టవశాత్తూ బస్సు పల్టీ కొట్టకపోవడంతో విద్యార్థులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సు నుండి కిందకు దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే, బస్సు డ్రైవర్, కారులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

దామెర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కారులో మద్యం సీసాలు లభించాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు. అతివేగం.. మద్యం మత్తులో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. స్కూల్ బస్సులను ఢీకొట్టే ఇలాంటి ఘటనలు పదేపదే జరగడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల త‌ల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Read Also: ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం.. గేటు పగలగొట్టి లోపలికి దూసుకెళ్లిన కారు!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×