BigTV English

Harish Rao : జలగంకు ఫోన్.. హెల్త్ డైరెక్టర్ కు హరీశ్ రావు క్లాస్.. కొత్తగూడెం టిక్కెట్ ఎవరికి..?

Harish Rao : జలగంకు ఫోన్.. హెల్త్ డైరెక్టర్ కు హరీశ్ రావు క్లాస్.. కొత్తగూడెం టిక్కెట్ ఎవరికి..?

Harish Rao : తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావుకు మంత్రి హరీష్‌రావు క్లాస్ తీసుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో రాజకీయ ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసిన మంత్రి హరీష్‌రావు… అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేయడం ఏంటని ఫైరయ్యారు. ఇకపై ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని గట్టిగా హెచ్చరించారు.


కొత్తగూడెం నుంచి BRS ఎమ్మెల్యే టికెట్ ఆశించిన డీహెచ్‌ శ్రీనివాసరావు… ఇటీవల నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో రాజకీయ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు… వివాదాస్పద పూజలు, హోమాలతో వార్తల్లోకి కూడా ఎక్కారు. శ్రీనివాసరావు చర్యలపై ఇప్పటిదాకా స్పందించని ప్రభుత్వం… BRS అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందు క్లాస్‌ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మొదటిసారి మాట్లాడినప్పుడే హెచ్చరించకుండా… ఇప్పుడు వార్నింగ్‌ ఇవ్వడమేంటనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ సూచనలతోనే మంత్రి హరీష్‌రావు… శ్రీనివాసరావుకు క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. జలగం వెంకట్రావుకు కూడా ఫోన్‌ చేసిన మంత్రి హరీష్‌రావు… తాను ఉన్నానని, తర్వాత అన్నీ చూసుకుంటా అని సముదాయించారని తెలుస్తోంది. మరి కొత్తగూడెం టిక్కెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×